ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక్కడ క్యాంపింగ్‌లో ఎంతమంది ఉన్నారో సరిగ్గా చెప్పగలరా?

ABN, First Publish Date - 2022-07-03T14:50:14+05:30

ఈ బ్రెయిన్-టీజర్ చిత్రంలో కొంతమంది వ్యక్తులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ బ్రెయిన్-టీజర్ చిత్రంలో కొంతమంది వ్యక్తులు క్యాంపింగ్‌లో ఉన్నారు. తొలిసారి చూసినవారు ఇందులో సరిగ్గా ఎంతమంది ఉన్నారో చెప్పలేకపోతున్నారు. టిక్‌టాక్ స్టార్ హెక్టిక్ నిక్ ఈ కన్ఫ్యూజన్ చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రానికి 12,8,000 వీక్షణలు వచ్చాయి. ఈ పజిల్‌ను పరిష్కరించాలని నెటిజన్లకు హెక్టిక్ నిక్ సవాలు చేశాడు. చిత్రంలో ముగ్గురు పురుషులు క్యాంపింగ్ చేయడాన్ని స్పష్టంగా చూడవచ్చు. 


చాలా మంది ఇది తెలివితక్కువ ప్రశ్న అనుకుంటారు. అయితే ఈ చిత్రంలో ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నప్పటికీ ఎంతమంది క్యాంపింగ్‌కు వెళ్లారనేది ఇక్కడున్న ప్రశ్న. దీనికి సరైన సమాధానం ముగ్గురు కాదు. చిత్రంలో కనిపిస్తున్న క్యాంపింగ్‌లో ఒక వ్యక్తి మంటను వెలిగిస్తున్నాడు. మరొక వ్యక్తి కలపను తీసుకువస్తున్నాడు. ఇంకొకరు చేతిలో పాత్రలు పట్టుకుని ఉన్నాడు. నిజానికి ఈ శిబిరంలో నలుగురు ఉన్నారు. పరిశీలనగా చూస్తే చిత్రంలో 4 స్పూన్లు, 4 కప్పులు, 4 ప్లేట్లు కనిపిస్తున్నాయి. అలాగే గుడారం సమీపంలోని చెట్టుపై క్యాంపింగ్ సభ్యుల చార్ట్ కూడా ఉంది. అందులో ముగ్గురి పేర్లు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకరి పేరు అస్పష్టంగా కనిపిస్తుంది. ఈ పజిల్‌కు సరైన సమాధానం 'నాలుగు'.


Updated Date - 2022-07-03T14:50:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising