ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Penis size: ముక్కు సైజును బట్టే పురుషాంగ పరిమాణం..సంచలనం రేపుతున్న కొత్త అధ్యయనం

ABN, First Publish Date - 2022-08-27T02:50:14+05:30

ముక్కు సైజును బట్టే పురుషాంగం పరిమాణం.. సంచలనం రేపుతున్న కొత్త అధ్యయనం!

శాస్త్రవేత్తలు పరిశీలించిన ముక్కు కొలతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: లైంగికాంశాల పట్ల ఆసక్తి సహజం. ఇక ఆధునిక వైద్య శాస్త్రం అందుబాటులో లేని రోజుల్లో ఈ విషయంలో ఎన్నో అపోహలు వ్యాప్తిలో ఉండేవి. అసలు ఏది నిజం, ఏది అబద్ధమో తెలుసుకోలేని నిస్సహాయత! రోమన్ మహాసామ్రాజ్యంలో పురుషాంగ పరిమాణానికి సంబంధించి ప్రజల్లో ఓ నమ్మకం ప్రచారంలో ఉండేది. వ్యక్తి ముక్కు పరిమాణంపైనే(Nasal Size) అంగపరిమాణం(penis size) ఆధారపడి ఉంటుందని అప్పట్లో వారు నమ్మేవారట. అందుకు తగ్గట్టుగానే శిక్షలు ఉండేవి. అప్పట్లో అక్రమసంబంధాలు పెట్టుకునే వాళ్లను, లైంగిక వేధింపులు పాల్పడే వారి ముక్కులు కోసేవారట. అయితే.. గతేడాది జపాన్ శాస్త్రవేత్తలు(Japan researchers) చేపట్టిన ఓ అధ్యయనంతో ఈ విషయంపై కాస్తంత క్లారిటీ వచ్చింది.


జపాన్ శాస్త్రవేత్తల వింత అధ్యయనం..

క్యోటో ప్రిఫెక్చూరల్ యునివర్శిటీ ఆఫ్ మెడిసిన్‌కు(Kyoto prefectural university of medicine) చెందిన శాస్త్రవేత్తలు ఓ వింత అధ్యయనం చేశారు. ఇందు కోసం వారు 126 మంది పురుషుల మృతదేహాలను(Dead bodies) ఎంచుకున్నారు. మరణించిన వారందరూ 30 నుంచి 50 ఏళ్ల లోపు వారే! ఈ అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు వారి అంగపరిమాణంతో పాటూ ముక్కు పొడుగు, వెడల్పు, మనిషి పొడవు, వెడల్పు, శరీర నిర్మాణం(Body shape) తీరు ఇత్యాది అంశాలను పరిశీలించారు. మృతదేహానికి అంగస్థంభన సాధ్యం కాదు కాబట్టి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని పురుషాంగం పొడవును కొలిచారు. ఆ తరువాత.. ఈ కొలతల మధ్య ఏదైనా సంబంధం ఉందో లేదో తేల్చేందుకు ఓ విశ్లేషణ చేపట్టారు. ఈ క్రమంలో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ముక్కు పరిమాణం బట్టే అంగ పరిమాణం ఉన్నట్టు తేలింది. పెద్ద ముక్కులు ఉన్న వారి సగటు అంగపరిమాణం పెద్దగా ఉన్నట్లు వెల్లడైంది.


అయితే.. మునుపటి అధ్యయనాలకు ఈ ఫలితాలు కొంత వ్యతిరేకంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.  పీఎన్ఏఎస్ జర్నల్‌లో 2013లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. మనిషి పొడవు, శరీర నిర్మాణానికి, అంగం పొడవుకు మధ్య సంబంధం ఉంది. అంతకు రెండేళ్ల మునుపు ఏషియన్ జర్నల్ ఆండ్రోలాజీలో పబ్లిష్ అయిన ఓ పరిశోధన పత్రం ప్రకారం.. చూపుడు వేలు, ఉంగరం వేలు పొడవుల నిష్ఫత్తిపై అంగం సైజు ఆధారపడి ఉంటుందట. ఈ నిష్పత్తి తక్కువగా ఉండే వారి అంగం పొడవు ఎక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. అయితే.. జపాన్ శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనంలో మాత్రం ఇటువంటివేవీ కనబడలేదు. అయితే.. ఇది మృతదేహాలపై చేసిన అధ్యయనం కావడంతో ఈ విషయంలో నిజానిజాలు తేల్చేందుకు మరింత పరిశోధన జరగాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



Updated Date - 2022-08-27T02:50:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising