Shocking video: అకస్మాత్తుగా విరిగిపడిన కొండచరియలు.. జాతీయ రహదారిపై షాకింగ్ ఘటన!
ABN, First Publish Date - 2022-08-09T02:50:10+05:30
హిమాచల్‌ప్రదేశ్‌లోని NH-5 జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారికి షాకింగ్ అనుభవం ఎదురైంది.
హిమాచల్‌ప్రదేశ్‌లోని NH-5 జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారికి షాకింగ్ అనుభవం ఎదురైంది. కిన్నౌర్‌లోని భావనగర్‌లో జాతీయ రహదారిపై (National highway) అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పర్వతం నుంచి కొండచరియలు పడుతున్న సమయంలో ఆ రోడ్డుపై భారీ సంఖ్యలో ప్రజలు ఉన్నారు.
ఒళ్లు గగుర్పొడిచే ఆ దృశ్యాలను కొందరు తమ సెల్‌ఫోన్లలో బంధించేందుకు ప్రయత్నించారు. భారీగా కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారిపై శిథిలాలు భారీగా పడిపోయాయి. దీంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలు స్థంభించిపోయాయి. రోడ్డుపై పడిన కొండ చరియలను తొలగించేందుకు యంత్రాలను ఏర్పాటు చేశారు.
Updated Date - 2022-08-09T02:50:10+05:30 IST