ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవ వధువు 4 నెలల pregnant...పోలీసులకు భర్త ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-06-18T12:38:07+05:30

నవ వధువు నాలుగు నెలల గర్భవతి కావడంతో భర్త, అత్తమామలు షాక్‌కు గురైన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో(ఉత్తరప్రదేశ్): నవ వధువు నాలుగు నెలల గర్భవతి కావడంతో భర్త, అత్తమామలు షాక్‌కు గురైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది.ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో నవ వధువు నాలుగు నెలల గర్భవతి అని తెలియడంతో అత్తమామలు, భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.నవ వధువు కడుపునొప్పి గురించి ఫిర్యాదు చేయడంతో వైద్యులకు చూపించగా ఆమె నాలుగు నెలల గర్భిణీగా తేలింది. నవ వధువుకు పెళ్లయి ఒకటిన్నర నెలలు మాత్రమే అయింది. కడుపునొప్పి రావడంతో నవవధువుకు సోనోగ్రఫీ పరీక్షలు చేయగా ఆమె గర్భిణీ అని ఆమె అత్తమామలకు తెలిసింది.దీంతో వారు కోడలిని ఇంటికి తీసుకెళ్లేందుకు నిరాకరించారు.నవ వధువు భర్త పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. 


ఓ బంధువు మధ్యవర్తిత్వంతో పొరుగు జిల్లాకు చెందిన యువతితో నెలన్నర క్రితం వివాహం జరిగింది. నవ వధువు తమను మోసం చేసిందని భర్త, అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నవవధువు గర్భం దాల్చిన విషయం వారికి ముందే తెలుసునని, అయితే నిజం దాచిపెట్టారని భర్త ఆరోపించాడు. ఈ కేసును క్షుణ్ణంగా విచారిస్తున్నట్లు పోలీసు అధికారి అభిషేక్ సింగ్ తెలిపారు.


Updated Date - 2022-06-18T12:38:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising