ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

hindu నూతన వధూవరుల ఇఫ్తార్ విందు

ABN, First Publish Date - 2022-04-28T16:37:05+05:30

మతపరంగా సున్నిత ప్రాంతంగా పేరొందిన దక్షిణ కన్నడ జిల్లాలో కొత్తగా పెళ్లయిన హిందూ యువకుడు మసీదులో ఇఫ్తార్ పార్టీ ఇచ్చిన ఉదంతంతో మత సామరస్యం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్ణాటకలో వెల్లివిరిసిన మత సామరస్యం

బెంగళూరు: మతపరంగా సున్నిత ప్రాంతంగా పేరొందిన దక్షిణ కన్నడ జిల్లాలో కొత్తగా పెళ్లయిన హిందూ యువకుడు మసీదులో ఇఫ్తార్ పార్టీ ఇచ్చిన ఉదంతంతో మత సామరస్యం వెల్లివిరిసింది. దక్షిణ కన్నడ జిల్లాలోని బంట్వాల్ తాలూకా, విట్టల్ పట్టణంలోని బైరికట్టెకు చెందిన జె చంద్రశేఖర్ అనే యువకుడు ఈ నెల 24వతేదీన వివాహం చేసుకున్నారు.ఈ నెలలో ముస్లింలు రమజాన్ పండుగ ఉపవాసాలు ఉండటంతో అతని ముస్లిం స్నేహితులు చాలామంది వివాహ వేడుక విందుకు రాలేక పోయారు.దీంతో చంద్రశేఖర్ వివాహం చేసుకున్నాక తన ముస్లిం స్నేహితుల కోసం ఏకంగా మసీదులోనే ఇఫ్తార్ పార్టీ నిర్వహించారు. 


హిజాబ్, హలాల్, లౌడ్ స్పీకర్లలో అజాన్, ముస్లింలకు చెందిన దుకాణాలను బహిష్కరించాలని హిందూ సంస్థలు పిలుపునిచ్చిన నేపథ్యంలో చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీ మత సామరస్యానికి చిహ్నంగా ఉద్భవించింది. హిజాబ్ నిషేధం, ముస్లిం వ్యాపారులపై నిషేధం, శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య, హలాల్ మాంసంపై నిషేధం వల్ల కర్ణాటక రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో హిందూ యువకుడైన చంద్రశేఖర్ ముస్లింల కోసం ఇఫ్తార్ విందు ఇవ్వడంతో అందరూ అతన్ని అభినందించారు.


ఇఫ్తార్ విందు అనంతరం నూతన వధూవరులను జలాలియా జుమా మసీద్ ఇమామ్, మసీదు కమిటీ సభ్యులు చంద్రశేఖర్ దంపతులను ఘనంగా సన్మానించారు.ఇఫ్తార్‌కు హాజరైన ప్రజలందరూ నూతన వధూవరులను ఆశీర్వదించారు.


Updated Date - 2022-04-28T16:37:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising