ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసుపత్రి వెలుపల గుక్కపెట్టి ఏడుస్తున్న పసికందు.. శబ్దం వచ్చే ప్రదేశానికి వెళ్లిన స్థానికులు.. అక్కడి సీన్ చూసి షాక్..

ABN, First Publish Date - 2022-04-18T01:40:14+05:30

అది నిత్యం రద్దీగా ఉండే ఆసుపత్రి ప్రాంగణం. శనివారం మధ్యాహ్నం ఆసుపత్రి వెలుపల నుంచి పసికందు ఏడుపు శబ్దం ఏకదాటిగా వినిపిస్తోంది. తొలుత ఈ విషయాన్ని లైట్‌గా తీసుకున్న స్థానికులు.. ఆ తర్వాత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అది నిత్యం రద్దీగా ఉండే ఆసుపత్రి ప్రాంగణం. శనివారం మధ్యాహ్నం ఆసుపత్రి వెలుపల నుంచి పసికందు ఏడుపు శబ్దం ఏకదాటిగా వినిపిస్తోంది. తొలుత ఈ విషయాన్ని లైట్‌గా తీసుకున్న స్థానికులు.. ఆ తర్వాత అనుమానం వ్యక్తం చేశారు. శబ్దం వచ్చే ప్రదేశానికి వెళ్లి చూశారు. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి షాకయ్యారు.  రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఓ గుర్తు తెలియని మహిళ.. పసికందును బాక్సులో పెట్టి నాగౌర్ సిటీలోని జేఎల్‌ఎన్ హాస్పిటల్ ప్రాంగణంలో వదిలి వెళ్లిపోయింది. ఈ క్రమంలో పసికందు ఏడుపు శబ్దాన్ని విని.. స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం అట్టపెట్టెలో ఏడుస్తూ ఉన్న పసికందును గుర్తించి చలించిపోయారు. వెంటనే వైద్యులకు సమాచారం అందించారు. ఆ పసికందు ఆరోగ్య పరిస్థితిని చూసిన వైద్యులు.. ఐసీయూలో పెట్టి చికిత్స అందించారు. తాజాగా ఆ నవజాత శిశువు ఆరోగ్య పరిస్థితిని మీడియాకు వెళ్లడించారు. పసికందు ఆరోగ్యం బాగానే ఉన్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. ఆసుపత్రి వద్ద ఆ చిన్నారిని వదిలి వెళ్లింది ఎవరు? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.




Updated Date - 2022-04-18T01:40:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising