ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యూయార్క్‌లోనూ Bulldozer ప్రతాపం.. దాదాపు 100 బైక్‌లు నుజ్జునుజ్జు.. వీడియో వైరల్

ABN, First Publish Date - 2022-06-24T01:59:08+05:30

ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా రద్దీ రోడ్ల మీద, వేగంగా, అడ్డదిడ్డంగా బైక్ రాయుళ్లు చేసే డర్ట్ బైక్ రేసింగ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా రద్దీ రోడ్ల మీద, వేగంగా, అడ్డదిడ్డంగా బైక్ రాయుళ్లు చేసే డర్ట్ బైక్ రేసింగ్ ఆమెరికాలో ఎన్నో ప్రమాదాలకు కారణమవుతోంది. అమెరికాలోని చాలా నగరాల్లో ఈ డర్ట్ బైక్ రేసింగ్ చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తోంది. ఎన్నో ప్రమాదాలకు కారణమవుతోంది. సాధారణ బైక్‌లను కాకుండా పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే స్పోర్ట్స్ బైక్‌లను రేసింగ్ కోసం వాడుతుంటారు. సాధారణంగా ఇలాంటి రేసింగ్‌కు రిజిస్ట్రేషన్ లేని వాహనాలనే ఎక్కువగా వాడుతుంటారు. అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో ఈ రేసింగ్ ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రజాభద్రతకు ప్రమాదకరంగా మారుతోంది. దీంతో న్యూయార్క్ పోలీసులు నిఘా పెట్టారు. 


ఎలాంటి రిజిస్ట్రేషన్ లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ బైక్‌లన్నింటినీ ఒక మైదానంలోకి చేర్చి వాటి మీద బుల్డోజర్ నడిపించి ధ్వంసం చేశారు. పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఆకతాయిలు పాల్గొనే ఈ రేసింగ్ చాలా ప్రమాదకరమని, అందుకే అలాంటి బైక్‌లను గుర్తించి నాశనం చేశామని న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు. ఆ వీడియోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Updated Date - 2022-06-24T01:59:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising