ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: ఈ విధమైన సంపాదనకు అలవాటు పడితే సమాజంలో గౌరవం కోల్పోతారు!

ABN, First Publish Date - 2022-03-09T13:18:48+05:30

నాటి ప్రముఖ ఆర్థికవేత్త ఆచార్య చాణక్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాటి ప్రముఖ ఆర్థికవేత్త ఆచార్య చాణక్య విధానాలు నేటి కాలంలోనూ ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. చాణక్య  తన జీవిత విధానాల బలంతో నంద వంశాన్ని నాశనం చేశాడు. సాధారణ పిల్లవాడైన చంద్రగుప్త మౌర్యను మగధ చక్రవర్తిగా చేశాడు. ఆచార్య చాణక్యకు రాజకీయాలలోనే కాకుండా ప్రతి విషయంపై లోతైన అవగాహన ఉంది. గొప్ప మేధావి, వ్యూహకర్త అయిన ఆచార్య చాణక్య తన తెలివితేటల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. సమాజానికి మార్గనిర్దేశం చేసేందుకు చాణక్య.. చాణక్యనీతిని రచించాడు. దానిలోని విధానాలను అనుసరించే వ్యక్తి జీవితంలో కష్టాలను ఎదుర్కోడు. తన కుటుంబంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతాడని చాణక్య తెలిపారు. చాణక్య తాను బోధించిన విలువలలో సంపద గురించి చెప్పాడు. అక్రమంగా సంపాదించే డబ్బు వలన ఏమి జరుగుతుందో వివరించాడు. 


ధర్మాన్ని విస్మరించి..

ధర్మాన్ని విస్మరించి డబ్బు సంపాదించాలనే తపనను విడిచిపెట్టాలని ఆచార్య చాణక్య తెలిపారు. ఎందుకంటే మోసం ద్వారా లేదా అక్రమంగా సంపాదించిన డబ్బు.. మీకు కష్ట సమయాల్లో ఉపయోగపడదని చాణక్య తెలిపారు. ఇటువంటి సంపాదన కారణంగా సమాజంలో గౌరవం దెబ్బతింటుందని ఆచార్య చాణక్య తెలిపారు. అందుకే ధర్మాన్ని విడిచిపెట్టి డబ్బు సంపాదించడం మానుకోవాలని చాణక్య తెలిపాడు. 

శత్రువును మెప్పిస్తూ.. 

ఆచార్య చాణక్య.. శత్రువును మెప్పించడం ద్వారా సంపాదించిన డబ్బును పనికిరానిదిగా భావించాడు. ఎందుకంటే అలాంటి డబ్బు సంపాదించడం ద్వారా ఆ వ్యక్తి ఎప్పుడూ అవమానానికి గురవుతాడు. అందుకే అటువంటి డబ్బును వదులుకోవడం సముచితమని చాణక్య తెలిపారు.

హింసను అనుభవిస్తూ..

ఒక వ్యక్తి హింసను అనుభవిస్తూ డబ్బును సంపాదించడం మంచిదికాదని ఆచార్య చాణక్య తెలిపాడు. ఎందుకంటే అటువంటి డబ్బు సంపాదించడానికి, శారీరక, మానసిక బాధలను అనుభవించాలి. ఫలితంగా కుటుంబం కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసినవారవుతారని చాణక్య తెలిపారు. 

Updated Date - 2022-03-09T13:18:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising