ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: పిల్లలకుండే ఈ అలవాట్లను నిర్లక్ష్యం చేస్తే తల్లిదండ్రులుగా మీరు ఫెయిలయినట్టే!

ABN, First Publish Date - 2022-01-20T11:52:11+05:30

ఆచార్య చాణక్య తన చాణక్య నీతిలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచార్య చాణక్య తన చాణక్య నీతిలో తల్లిదండ్రులు పిల్లలతో ఎలా మెలగాలో తెలియజేశారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీ పిల్లలు మీతో అబద్ధం చెబుతున్నారని తెలిస్తే తల్లిదండ్రులుగా మీరు వారి తప్పొప్పులను గ్రహించాలి. పిల్లలకున్న ఈ అలవాటును తొలగించేందుకు ప్రయత్నించండి. అబద్ధం చెప్పే అలవాటు చాలా తొందరగా అలవడుతుంది.  సకాలంలో దీనికి అడ్డుకట్ట వేయకపోతే మీ పిల్లలు మీకు అబద్ధాలు చెప్పేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటారు. 


ఫలితంగా మీ పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్లేందుకు అవకాశాలుంటాయి. అప్పుడు మీరు మీ పిల్లలను అదుపు చేయలేరు. అందుకే పిల్లలకు నిజం నిజం చెప్పే అలవాటును నేర్పించాలి. చాణక్య నీతి ప్రకారం, పిల్లలకు మొండితనం తొందరగా అలవాటు అలవడుతుంది. అందుకే వారి ప్రతీమాటకూ తల్లిదండ్రులు తల ఊపకూడదు. పిల్లల మాట జాగ్రత్తగా వినండి. తప్పు, ఒప్పుల  మధ్య వ్యత్యాసాన్ని వారికి చెప్పండి. వారు అడిగినవి వెంటనే కొని ఇవ్వకండి. మితిమీరి ముద్దుచేయడం కారణంగా పిల్లలలో మంచి అలవాట్లు క్షీణించి, వారిలో మొండితనం పెరుగుతుంది. పిల్లలు తమ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడుపుతారు కాబట్టి, వారు తల్లిదండ్రుల అలవాట్లను గమనించి, అనుసరిస్తారు. అందుకే మీరు నిరంతరం సత్ప్రవర్తనతో మెలిగేందుకు ప్రయత్నించండి. తద్వారా వారు మీ నుండి మంచి విలువలను స్వీకరించగలుగుతారు. పిల్లల ముందు ఎప్పుడూ గొడవ పడకండి. ఇది పిల్లలలో కోపాన్ని చికాకును పెంచుతుంది. చిన్నతనం నుండే పిల్లల్లో మంచి విలువలకు ఏర్పడేందుకు పునాది వేయండి. గొప్ప వ్యక్తుల గురించి వారికి చెప్పండి. ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు వారికి ప్రోత్సాహాన్ని అందించండి.

Updated Date - 2022-01-20T11:52:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising