ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

chanakya niti: ధనవంతులయ్యాక ఈ పనులు అస్సలు చేయకూడదు... లేదంటే సమస్యలు చుట్టుముట్టడం ఖాయం!

ABN, First Publish Date - 2022-10-17T17:48:02+05:30

చాణక్య నీతిలో పేర్కొన్న విషయాలను అనుసరించే వ్యక్తి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాణక్య నీతిలో పేర్కొన్న విషయాలను అనుసరించే వ్యక్తి జీవితంలో విజయానికి చేరువవుతాడు చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనిషి ధనవంతుడు అయినప్పుడు, అతను చాలా విషయాలపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే అధికంగా ఉన్న సొమ్ము పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే కొన్ని ముఖ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని చాణక్య తెలిపారు.

మీ దగ్గరున్న డబ్బు గురించి ఎవరికీ చెప్పకండి

ధనవంతుడు అయినప్పుడు ముందుగా చేయవలసిన పని,,. దాని గురించి ఎవరితోనూ చెప్పకూడదు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును కాపాడుకోవాలి. మీ సంపద గురించి అందరితో చర్చిస్తే మీకు శత్రువుల సంఖ్య పెరుగుతుంది. మీ గురించి తెలుసుకున్న కొందరు దొంగలుగా మారి, అవకాశం దొరికినప్పుడు మీకు హాని కలిగించేందుకు అవకాశం ఉంటుంది.


గొప్పలకు దూరం

మన ఆదాయం పెరిగినప్పుడు ఇతరుల ముందు దాని గురించి గొప్పగా చెప్పకూడదు. ఇలా చేయడం వల్ల మీ శ్రేయోభిలాషులు సైతం మీకు దూరం అవుతారు. ధనం వచ్చినప్పుడు అతి ఉత్సాహానికి దూరంగా ఉండాలి. మనకున్న డబ్బును ప్రదర్శించడం వల్ల శత్రువుల సంఖ్య పెరుగుతుంది. అందుకే డబ్బు వచ్చినప్పుడు నిదానంగా మెలగాలి. మనిషి తన దగ్గరున్న డబ్బును తనతోపాటు ఇతరుల అభ్యున్నతికి ఉపయోగించాలని ఆచార్య చాణక్య తెలిపారు.  

ఖర్చును నియంత్రించండి

డబ్బు వచ్చినప్పుడు దానిని తెలివిగా ఖర్చు పెట్టాలి. ఆర్థిక సంక్షోభ సమయంలో డబ్బు మాత్రమే నిజమైన స్నేహితుడు. అందుకే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని డబ్బును సక్రమంగా వినియోగించుకోవాలి.

చెడు పనులకు ఉపయోగించవద్దు

డబ్బును మంచి పనులకు మాత్రమే వినియోగించాలి. ఇతరులను కించపరచడానికి, హాని చేయడానికి డబ్బును ఎప్పుడూ ఉపయోగించకూడదు. అలా చేస్తే సంపదలకు నిలయం అయిన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందని ఆచార్య చాణక్య తెలిపారు. డబ్బును ఎప్పుడైనాసరే సక్రమంగా వినియోగించాలని చాణక్య సూచించారు. 



Updated Date - 2022-10-17T17:48:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising