ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral video: ఈ బుడ్డోడు చాలా ఫాస్ట్.. పెళ్లిలోని సన్నివేశాలను చిత్రీకరించేందుకు ఎలాంటి ఫీట్స్ చేస్తున్నాడో చూడండి..

ABN, First Publish Date - 2022-04-27T14:50:13+05:30

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో చిన్న పిల్లలు కూడా చాలా స్మార్ట్‌గా తయారయ్యారు. కొన్నిసార్లు పెద్దవారు ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తుంటారు. కొందరైతే సెల్ఫీలు, వీడియోలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో చిన్న పిల్లలు కూడా చాలా స్మార్ట్‌గా తయారయ్యారు. కొన్నిసార్లు పెద్దవారు ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తుంటారు. కొందరైతే సెల్ఫీలు, వీడియోలు తీయడమే పనిగా పెట్టుకుంటూ ఉంటారు. ఈ పిచ్చిలో పడి వారు ఏం చేస్తున్నారో వారికే తెలీనంతగా లీనమవుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ బుడ్డోడు పెళ్లిలోని సన్నివేశాలను తన ఫోన్‌లో చిత్రీకరించే సమయంలో చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. కెమెరామెన్‌లకు తానేమీ తగ్గనంటూ వివిధ యాంగిల్స్‌లలో వీడియోలను చిత్రీకరిస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.


ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ పెళ్లి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అక్కడ కొందరు పిల్లలంతా కలిసి డ్యాన్స్ చేస్తుంటారు. ఈ సన్నివేశాలను చిత్రీకరించేందుకు ఓ బాలుడు ముందుకొస్తాడు. స్మార్ట్ ఫోన్ పట్టుకుని వివిధ యాంగిల్స్‌లో వీడియో తీసేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ముందుకు, వెనక్కు జరగడం.. ఒక్కసారిగా కింద పడుకోవడం వంటి విన్యాసాలు చేస్తూనే.. మరో వైపు వీడియో తీస్తాడు. ఈ విన్యాసాలు చూడటానికి నవ్వు తెప్పించేలా ఉంటాయి. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ బాలుడు ఉంటే.. కెమెరామెన్లతో పని లేదు.. అంటూ చమత్కరిస్తున్నారు.

వివాహ వేడుకలో వరుడి పక్కనే కూర్చున్న వ్యక్తి.. దొంగచాటుగా ఇంత పని చేశాడేంటీ..





Updated Date - 2022-04-27T14:50:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising