ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లి పక్కన నిద్రపోతున్న బాలిక నోరు మూసి ఎత్తుకెళ్లిన పక్కింటి యువకులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-06-03T20:04:36+05:30

ఆ పదిహేనేళ్ల బాలిక వేసవి సెలవులు కావడంతో ఇంట్లోనే ఉంటోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ పదిహేనేళ్ల బాలిక వేసవి సెలవులు కావడంతో ఇంట్లోనే ఉంటోంది.. గత నెల 25వ తేదీ మధ్యాహ్నం భోజనం తర్వాత తన తల్లితో కలిసి నిద్రపోయింది.. ఆ సమయంలో పక్కింట్లో ఉండే ఇద్దరు యువకులు రహస్యంగా ప్రవేశించారు.. నిద్రపోతున్న ఆ బాలిక నోరు మూసి ఎత్తుకెళ్లారు.. సమీపంలోని ఓ టెంట్ హౌస్ షాప్‌లోనికి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 


ఇది కూడా చదవండి..

అతనేం చేస్తున్నాడో అర్థమై పరిగెత్తిన మహిళ.. పోలీసులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో ట్విటర్ ద్వారా ఫిర్యాదు చేస్తే..


రాజస్థాన్‌లోని జైపూర్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక గత నెల 25వ తేదీ మధ్యాహ్నం భోజనం తర్వాత తన తల్లితో కలిసి నిద్రపోయింది. ఆ సమయంలో పక్కింట్లో ఉండే ఇద్దరు యువకులు రహస్యంగా ప్రవేశించారు. వారిద్దరూ నిద్రపోతున్న ఆ బాలికను కిడ్నాప్ చేశారు. సమీపంలోని ఓ టెంట్ హౌస్ షాప్‌లోనికి తీసుకెళ్లారు. అక్కడ ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వారికి ఓ మైనర్ బాలుడు కూడా సహాయం చేశాడు. అత్యాచారం అనంతరం ఆ బాలికను వారు బెదిరించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించారు. 


దీంతో ఆ బాలిక వారం రోజుల వరకు తన ఇంట్లో వారికి ఈ విషయం చెప్పలేదు. అయితే ఆ బాలిక ప్రవర్తన చూసి తల్లికి అనుమానం వచ్చింది. ఆమె గట్టిగా ప్రశ్నించగా బాధిత బాలిక అసలు విషయం చెప్పింది. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2022-06-03T20:04:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising