ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nayanthara: సరోగసిపై ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నయనతార..!

ABN, First Publish Date - 2022-10-17T18:34:51+05:30

సినీ నటి నయనతార-విగ్నేశ్‌ (nayan vignesh shivan) దంపతులు ‘సరోగసి’ (surrogacy) ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ నటి నయనతార-విగ్నేశ్‌ (nayan vignesh shivan) దంపతులు ‘సరోగసి’ (surrogacy) ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. తమిళనాడు ప్రభుత్వం (TN Govt) నయనతార దంపతులను (vikki nayan) ఈ వ్యవహారంపై వివరణ కోరింది. ఇందుకు సంబంధించి నయనతార (Nayanthara) తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖకు (Tamilnadu Health Department) అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ అఫిడవిట్‌లో నయనతార కీలక విషయాలను వెల్లడించింది. విగ్నేష్, తాను ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ (Nayanthara marriage 6 years ago) చేసుకున్నామని.. అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను ఆ అఫిడవిట్‌కు జత చేసి నయనతార పంపింది. అయితే.. జూన్, 2022లో నయన్, విగ్నేష్ దంపతులు వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకోవడం ప్రపంచానికి తెలిసిన విషయం. అయితే.. ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు ఈ వివరణతో వెల్లడైంది. సరోగసి నిబంధనలను ఈ జంట ఉల్లంఘించిందనే ఆరోపణల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆరా తీయగా ఈ విషయాలన్నీ వెలుగులోకొచ్చాయి.



సరోగసి విధానంలో కవల పిల్లలకు జన్మనిచ్చింది నయనతార బంధువేనని ఆ అఫిడవిట్‌లో నయన్ వెల్లడించింది. ఆమె యూఏఈలో ఉంటుందని నయనతార తెలిపింది. నయనతార(Nayanthara) దంపతులకు సరోగసి విధానం ద్వారా బిడ్డలను అందించిన ఆసుపత్రిని తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. ఈ వ్యవహారంలో ఆరోగ్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో ఎవరు నిబంధనలు అతిక్రమించినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం ఇప్పటికే స్పష్టం చేశారు. 2022, జూన్‌ 9న నయనతార-విఘ్నేష్‌ శివన్‌ వివాహం చేసుకున్నారు. అయితే, వీరిద్దరు సరోగసీ ద్వారా పిల్లలు కనేందుకు కూడా ఐదేళ్ళు పూర్తికావాల్సి ఉంది. కానీ వీరిద్దరూ ఐదు నెలలు తిరగకముందే ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఇదే పెద్ద వివాదానికి దారితీసింది.



అయితే.. నయనతార తాజాగా ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో తమకు ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ అయినట్లు స్పష్టం చేసింది. ఆరేళ్ల క్రితం వివాహం జరిగినట్లు ప్రభుత్వం కూడా గుర్తిస్తే ఈ వివాదానికి దాదాపుగా తెరపడినట్టే అని చెప్పొచ్చు. సాధారణంగా ఒక జంట సరోగసీ విధానంలో పిల్లలకు జన్మనివ్వాలంటే అందులోని విధి విధానాలను ఆ జంటకు వైద్యులు వివరించాల్సి ఉంటుంది. ఇది వైద్యుల కర్తవ్యం కూడా. నయనతార విషయంలో వైద్యులు ఈ నిబంధనలన్నీ పాటించారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. సుప్రీంకోర్టు నిషేధించిన ఈ అద్దె గర్భం విధానాన్ని ఈ దంపతులు ఎలా అమలు చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

Updated Date - 2022-10-17T18:34:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising