ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Students: జాతీయ నేతల మాస్కులతో విద్యార్థులు

ABN, First Publish Date - 2022-08-13T13:48:27+05:30

నగరంలో 75వ స్వాతంత్య్రదినోత్సవాన్ని అమృతోత్సవం పేరిట జరుపుకొనేందుకు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): నగరంలో 75వ స్వాతంత్య్రదినోత్సవాన్ని అమృతోత్సవం పేరిట జరుపుకొనేందుకు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నగరమంతటా ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్‌(Corporation) భవనాలు మువ్వన్నెల విద్యుద్దీపాలంకరణలతో జిగేలు మంటున్నాయి. ఇదే విధంగా రాష్ట్రమంతటా శనివారం నుంచి సోమవారం వరకూ ఇళ్ళపై మువ్వన్నెల పతకాలను ఎగురవేయడానికి కూడా ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు అమృతోత్సవాలను స్వాగతిస్తూ వివిధ రకాల కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆ మేరకు నగరంలోని ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థులు శుక్రవారం ఉదయం క్రీడా మైదానంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులంతా మహాత్మాగాంధీ(Mahatma Gandhi), నేతాజీ, సర్దార్‌ వల్లభబాయ్‌ పటేల్‌, భగత్‌సింగ్‌, భారతియార్‌ వంటి స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలు ముద్రించి ఉన్న మాస్కులను ముఖాలకు ధరించారు. ఇదే విధంగా అన్నానగర్‌లోని ఓ పాఠశాల విద్యార్థినులు ముఖాలకు మువ్వనెల జెండా రంగులను ముఖాలకు పులుముకుని సందడి చేశారు.

Updated Date - 2022-08-13T13:48:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising