ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు నెలల తర్వాత వీడిన మిస్టరీ.. రాత్రికి రాత్రే ఆ కుటుంబంలోని 9 మంది ఆత్మహత్య చేసుకోవడం వెనుక..!

ABN, First Publish Date - 2022-10-08T00:24:39+05:30

మహారాష్ట్రలో సంచలనంగా మారిన సాముహిక ఆత్మహత్యల ఘటన వెనకున్న మిస్టరీ మూడు నెలల తర్వాత వీడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహారాష్ట్రలో సంచలనంగా మారిన సాముహిక ఆత్మహత్యల ఘటన వెనకున్న మిస్టరీ మూడు నెలల తర్వాత వీడింది. సాంగ్లీకి చెందిన ఇద్దరు సోదరులు తమ కుటుంబ సభ్యులతో సహా జూన్ నెలలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఘటనలో మొత్తం 9 మంది చనిపోయారు. గ్రామంలోని ప్రజల దగ్గర లక్షల్లో అప్పులు చేసి వాటిని తీర్చలేక అందరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారని గ్రామస్థులు, పోలీసులు భావించారు. అయితే అవి సామూహిక ఆత్మహత్యలు కావని, సామూహిక హత్యలని మూడు నెలల విచారణ అనంతరం పోలీసులు తేల్చారు. ఇద్దరు తాంంత్రికులు వారిని చంపేశారని పోలీసులు వెల్లడించారు. 


ఇది కూడా చదవండి..

ముక్కూముఖం తెలియని వాడితో ‘ఆన్‌లైన్ ప్రేమ’లో పడిపోతే ఇలాంటివే జరుగుతాయ్.. రూ.70 లక్షలు మటాష్..!


యల్లప్ప వాన్‌మోర్ (52), మానిక్ వాన్‌మోర్ (49) అనే ఇద్దరు సోదరులు జూన్ 20వ తేదీన తమ కుటుంబ సభ్యులతో కలిసి విషం తాగి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది.  వీరంతా విషం తాగి ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. గ్రామస్థుల దగ్గర చేసిన అప్పులు తీర్చలేక వాన్‌మోర్ సోదరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి తమ ఇంట్లోనే ఆత్మహత్యలు చేసుకున్నారని అప్పట్లో భావించారు. వారికి అప్పులు ఇచ్చి, తీర్చమని ఒత్తిడి చేసి, ఆత్మహత్యలకు ప్రేరేపించారని 25 మందిపై కేసులు కూడా పెట్టారు. అయితే విచారణ జరుగుతున్న కొద్దీ అసలు విషయం బయటపడింది. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షోలాపూర్‌కు చెందిన అబ్బాస్ బగ్వాన్, అతడి శిష్యుడు ధీరజ్ చంద్రకాంత్ తాంత్రిక విద్య పేరుతో వాన్‌మోర్ సోదరులను మోసం చేశారు. తమ చేత పూజలు చేయించుకుంటే ఇంట్లోని నిధిని బయటకు తీస్తామని చెప్పి నమ్మించారు. వారి నుంచి రూ.5 లక్షలు తీసుకున్నారు. జూన్ 19 రాత్రి, వారిద్దరూ వాన్‌మోర్ కుటుంబం ఇంట్లో ఒక పూజను చేశారు. అనంతరం అందరినీ బయటకు వెళ్లిపోమని చెప్పి ఆ తర్వాత ఒక్కొక్కరినీ లోపలికి రమ్మన్నారు. లోపలికి వచ్చిన ఒక్కొక్కరితో ప్రసాదం పేరు చెప్పి విషం తినిపించారు. మొత్తం అందరినీ చంపేసిన తర్వాత డబ్బు తీసుకుని పారిపోయారు. సీసీటీవీ కెమేరాల ఆధారంగా పోలీసులు ఈ కేసులో నిందితులను పట్టుకున్నారు. వారిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2022-10-08T00:24:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising