ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేయసితో నా భర్త పారిపోయెను.. వెతికి తెచ్చిన వారికి నగదు బహుమతి.. ఇదీ నెట్టింట ఓ భార్య పోస్ట్.. అసలు కథేంటంటే..

ABN, First Publish Date - 2022-09-15T21:21:11+05:30

‘ప్రియురాలితో కలిసి నా భర్త పారిపోయాడు. అతడి ఆచూకి చెప్పిన వాళ్లకు బహుమతి ఇస్తా’ అంటూ ఓ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఇంతకూ ఆమె ఎవరు? ఆమెకొచ్చిన కష్టం ఏం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ‘ప్రియురాలితో కలిసి నా భర్త పారిపోయాడు. అతడి ఆచూకి చెప్పిన వాళ్లకు బహుమతి ఇస్తా’ అంటూ ఓ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఇంతకూ ఆమె ఎవరు? ఆమెకొచ్చిన కష్టం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.


మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని అలోట్(Alote) ప్రాంతానికి చెందిన స్వప్నకు విక్రమ్ నవైత్య అనే వ్యక్తితో 2012లో వివాహం జరిగింది. ఈ క్రమంలోనే ఈ భార్యభర్తలు.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. స్వప్న అవాలియా సోలంకి (Avalia Solanki) అనే గ్రామంలో అసిస్టెంట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తుండగా.. విక్రమ్ మాత్రం నిరుద్యోగి. ఏమైందో ఏమో తెలియదు కానీ కొద్ది రోజులుగా ఈ భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో విక్రమ్ గత నెల 17 నుంచి కనబడకుండా పోయాడు. దీంతో స్వప్న సోషల్ మీడియాలో భర్త గురించి పోస్ట్ పెట్టింది. ‘ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు విక్రమ్ నవైత్య. ఈయన నా భర్త. ఆగస్టు 17 నుంచి కనిపించడం లేదు. అతడికి మరో యువతితో సంబంధం ఉంది. ఆమెతో కలిసి అతడు పారిపోయాడు. మాయమాటలు చెప్పి యువతులను మోసం చేస్తూ ఉంటాడు. ఇంట్లోంచి పారిపోతూ రూ.2లక్షల నగదు, ఆభరణాలు, కారు కూడా ఎత్తుకెళ్లాడు. ఇతడి ఆచూకీ ఎవరైనా చెబితే తగిన బహుమతి ఇస్తా’ అంటూ సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌(Viral)గా మారింది. 


ఇదిలా ఉంటే.. స్వప్న మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తన భర్త రోజూ తనను మానసికంగా, శారీరకంగా హింసించే వాడని చెప్పారు. అదనపు కట్నం కోసం వేధించినట్టు వెల్లడించారు. తన భర్తతోపాటు తన ప్రేయసిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు అతడి జాడ దొరకలేదన్నారు. 




Updated Date - 2022-09-15T21:21:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising