ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వయసు మీద పడుతున్నా పెళ్లి చేసుకోనివ్వడం లేదని తల్లిపై కోపం.. చివరకు ఆ ఇద్దరు అన్నాదమ్ముళ్లు కలిసి..

ABN, First Publish Date - 2022-06-06T18:11:44+05:30

ఆ అన్నాదమ్ములిద్దరికీ వయసు మీద పడుతోంది.. అయినా తల్లి వారిని పెళ్లి చేసుకోనివ్వడం లేదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ అన్నాదమ్ములిద్దరికీ వయసు మీద పడుతోంది.. అయినా తల్లి వారిని పెళ్లి చేసుకోనివ్వడం లేదు.. ఏవో సాకులు చెప్పి పెళ్లిళ్లు వాయిదా వేస్తోంది.. పైగా తల్లి చేతబడి చేస్తోందని కూడా కొడుకులు అనుమానించారు.. దీంతో వారిద్దరూ కలిసి ఆమెను హత్య చేశారు.. అనంతరం తమకేమీ తెలియనట్టు నాటకం ఆడారు.. చివరకు మొబైల్ లొకేషన్ ఆధారంగా పోలీసులకు దొరికిపోయారు.. ముంబైలో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

న్యూడ్ వీడియో చూపించి మేనత్తను బెదిరిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు.. ఆమె తన సోదరితో కలిసి ఏం చేసిందంటే..


ముంబైలోని వాడాలా కోర్బా ప్రాంతంలో నివసిస్తున్న నిర్మల అనే 42 ఏళ్ల మహిళ శనివారం తన ఇంట్లో హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. ఆ మహిళ కొడుకులు అక్షయ్, కోమల్‌ను ప్రశ్నించారు. ఘటన జరిగిన సమయంలో తాము ముంబైలో లేమని, లోనావాలో ఉన్నామని వారు పోలీసులకు చెప్పారు. అయితే పోలీసులు వారి మొబైల్ లొకేషన్లను చెక్ చేయగా వారు ముంబైలోనే ఉన్నట్టు తేలింది. 


పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారు అసలు విషయం చెప్పేశారు. తమ తల్లి చేతబడి చేస్తుంటుందని, ఎంత వయసు వచ్చినా తమను పెళ్లిళ్లు చేసుకోనివ్వడం లేదని, అందుకే ఆమెను చంపేశామని విజయ్, కోమల్ పోలీసుల ఎదుట అంగీకరించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2022-06-06T18:11:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising