ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ అమ్మాయి మా పరువు తీసింది.. ప్రియుడితో ఎప్పుడో వెళ్లిపోయిందంటూ అత్తింట్లో ఆగ్రహం.. ఏడాది తర్వాత ఊహించని ట్విస్ట్..!

ABN, First Publish Date - 2022-10-07T21:09:39+05:30

ఏడాది క్రితం ముంబై వసాయ్ బీచ్‌లో ఓ భారీ సూట్ కేస్ అనుమానాస్పదంగా కనిపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏడాది క్రితం ముంబై వసాయ్ బీచ్‌లో ఓ భారీ సూట్ కేస్ అనుమానాస్పదంగా కనిపించింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి సూట్‌కేస్ ఓపెన్ చూసి చూడగా లోపల తల లేని ఓ యువతి మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. మరణించిన ఆ యువతి గుర్తింపు గురించి తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ సూట్‌కేసు ఫొటోలు, దుస్తుల ఫొటోలు, మృతదేహంపై గుర్తులను పేర్కొంటూ పేపర్లలో ప్రకటనలు వేశారు. సమీప పోలీస్ స్టేషన్‌లన్నింటికీ సమాచారం అందించారు. అయినా ఎవరూ ఆ అమ్మాయిని గుర్తు పట్టలేకపోయారు. ఏడాది గడిచిపోయినా పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. 




తమ అమ్మాయి సానియా షేక్ కనిపించడం లేదని కర్ణాటకలోని బెల్గాంకు చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సానియా షేక్ ముంబైకి చెందిన ఆసిఫ్ షేక్‌ను వివాహం చేసుకుంది. వారికి ఓ ఆడపిల్ల జన్మించింది. సానియా చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామ ఆమెను పెంచి పెద్ద చేశాడు. ముంబైకి చెందిన ఆసిఫ్‌కు ఇచ్చి వివాహం చేశాడు. అయితే గతేడాది నుంచి సానియా ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆమెకు సంబంధించిన వివరాలేవీ మేనమామకు తెలియలేదు. ఆయన తరచుగా సానియా, ఆసిఫ్ ఫోన్లకు ప్రయత్నిస్తున్నా ఉపయోగం కనిపించలేదు. దీంతో నెల రోజుల క్రితం నేరుగా ముంబైలోని ఆసిఫ్ ఇంటికి బయల్దేరాడు. అక్కడ అతనికి షాకింగ్ విషయం తెలిసింది. సానియా ఏడాది క్రితం కూతురు అమైరాను, తమను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయిందని అత్తింటి వారు చెప్పారు. 


షాకైన మేనమామ పోలీసులను ఆశ్రయించాడు. తమ సానియా గురించిన వివరాలు అందించాడు. దీంతో పోలీసులు ఏడాది క్రితం తమకు దొరికిన మృతదేహానికి సంబంధించిన ఫొటోలు, గుర్తులు చూపించారు. అవి తమ సానియావేనని మేనమామ తెలిపాడు. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసుకున్నారు. సానియా డీఎన్‌ఏ శాంపిల్స్‌తో అమైరా డీఎన్‌ఏ శాంపిల్స్ సరిపోవడంతో ఆ మృతదేహం సానియాదేనని నిర్ధారించుకున్నారు. అత్తింటి వారిని విచారణకు పిలిచారు. వారందరూ సానియా ఎవరితోనో వెళ్లిపోయిందని ఒకే కథ చెప్పారు. తమదైన శైలిలో విచారించడంతో సానియా భర్త ఆసిఫ్ అసలు నిజం అంగీకరించాడు. కుటుంబ సభ్యుల సహకారంతో తనే సానియాను చంపినట్టు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు ఆసిఫ్ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2022-10-07T21:09:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising