ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తైవాన్‌లో తరచూ భూకంపాలు ఎందుకు వస్తాయి?.. ఇప్పటివరకూ వచ్చిన భీకర భూకంపాలివే...

ABN, First Publish Date - 2022-09-22T16:18:39+05:30

why do so many earthquakes occur in taiwan dnm spl

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తైవాన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇటీవల వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదయ్యింది. ఈ భూకంపం అనంతరం సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆదివారం సంభవించిన భూకంపం ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. భూకంప ప్రభావం కారణంగా రైళ్లు కూడా పట్టాలు తప్పాయి. ఒక పురాతన భవనం నిట్టనిలువునా కూలిపోయింది. అమెరికా శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం 24 గంటల వ్యవధిలో వందకుపైగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 


నిజానికి తైవాన్ సర్కమ్ పసిఫిక్ సెస్మిక్ జోన్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ భూకంపాలు సంభవించడం సర్వసాధారణం. పైగా భూకంప తీవ్రతలు కూడా అధికంగా ఉంటాయి. సెంట్రల్ వెదర్ బ్యూరో తెలిపిన వివరాల ప్రకారం 1900 నుంచి 1990 మధ్య కాలంలో దేశంలో ప్రతీయేటా 2200 భూకంపాలు సంభవించాయి. వీటిలో 214 ప్రమాదకర భూకంపాల శ్రేణిలోకి వస్తాయి. 1991లో సెస్మిక్ నెట్వర్క్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. దీనిద్వారా భూకంపాలను తెలుసుకునే అవకాశం సులభమయ్యింది. తైవాన్ రెండు టెటోనిక్ ప్లేట్లకు సమీపంలో ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఇక్కడ భూకంపాలు సంభవించడం సర్వసాధారణం. తైవాన్‌లో అత్యంత భారీ భూకంపం 2016లో సంభవించింది. ఈ ఘటనలో 100 మంది మృతి చెందారు. 1999లో వచ్చిన భూకంపంలో 2000 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2022-09-22T16:18:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising