ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొడవాటి గోర్లతో పొంచివున్న తెలియని ప్రమాదం.. వివరాలివే!

ABN, First Publish Date - 2022-04-24T17:50:52+05:30

పొడవాటి గోర్లు కలిగి ఉండటం ఒక ట్రెండ్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొడవాటి గోర్లు కలిగి ఉండటం ఒక ట్రెండ్. అందం పరంగా ఈ ట్రెండ్ బాగానే ఉండొచ్చు కానీ పొడవాటి గోళ్ల విషయంలో శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల ఫలితాలు బెంబేలెత్తించేలావున్నాయి. పొడవాటి గోర్లు 32కు మించిన బ్యాక్టీరియాలను, 28కు మించిన అధిక రకాల ఫంగస్‌లకు నిలయంగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ డీసీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. పరిశోధనలో, పొడవాటి గోళ్లలో స్టాఫ్ ఆరియస్ అనే బ్యాక్టీరియాను కూడా గుర్తించామని పరిశోధకులు అంటున్నారు. 


ఇది చర్మ వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాను వ్యాప్తి చేస్తుంది. ఈ బాక్టీరియా గోరు కింద ఉంటుంది. గోళ్ల కింద ఉండే బ్యాక్టీరియా కనిపించదు కనుక దీనిని తెలియని ప్రమాదం అని అంటారు. DailyMail తెలిపిన వివరాల ప్రకారం సాధారణంగా ఈ బ్యాక్టీరియా హాని కలిగించదని చెప్పారు. కానీ  తీవ్రమైన ఇన్ఫెక్షన్ వ్యాపిస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి. అటువంటప్పుడు గోరు భాగంలో వాపు, గోరు గట్టిపడటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ కొత్త పరిశోధనపై నెయిల్ ఎక్స్‌పర్ట్ కైలా న్యూమాన్ మాట్లాడుతూ ఈ పరిశోధనతో తాను ఏకీభవించనని, పొడవాటి గోళ్లను పెంచుకునేవారికి వాటిని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో బాగా తెలుసన్నారు. 

Updated Date - 2022-04-24T17:50:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising