ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలులో ప్రయాణిస్తున్న వివేకానందుణ్ణి వేళాకోళం చేసిన ఇద్దరు ఆంగ్లేయులు... స్వామీజీ ఏం సమాధానం ఇచ్చారంటే...

ABN, First Publish Date - 2022-12-14T11:51:50+05:30

మనకు కఠిన పరిస్థితులు ఏర్పడినప్పుడు మన సహనానికి పరీక్ష ఎదురవుతుంది. చాలా మంది అటువంటి సమయాల్లో సహనాన్ని కోల్పోతుంటారు. మీపై విమర్శలు వచ్చినప్పటికీ వాటిని విని ఓర్పు వహిస్తే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనకు కఠిన పరిస్థితులు ఏర్పడినప్పుడు మన సహనానికి పరీక్ష ఎదురవుతుంది. చాలా మంది అటువంటి సమయాల్లో సహనాన్ని కోల్పోతుంటారు. మీపై విమర్శలు వచ్చినప్పటికీ వాటిని విని ఓర్పు వహిస్తే మీరు అనేక సమస్యల నుంచి బయటపడతారు. దీనిని స్వామి వివేకానంద జీవితంలోని ఒక ఉదంతం ద్వారా తెలుసుకోవచ్చు. ఒకరోజు రామకృష్ణ పరమహంస శిష్యుడైన స్వామి వివేకానంద రైలులో మొదటి తరగతిలో కూర్చుని ప్రయాణిస్తున్నారు.

ఆ రోజుల్లో రైలులో మొదటి తరగతిలో ప్రయాణించడం చాలా ఖరీదైన విషయం. ఆ కంపార్ట్‌మెంట్‌లో సామాన్యులు కూర్చొనే అవకాశం లేదు. స్వామీజీ సన్యాసి తరహా దుస్తులు ధరించారు. ప్రయాణంం మధ్యలో ఇద్దరు ఆంగ్లేయులు వచ్చి అతని పక్కన కూర్చున్నారు. రైలులో మొదటి తరగతిలో ఒక సన్యాసిని కూర్చోవడాన్ని చూసి వారిద్దరూ ఆశ్చర్యపోయారు. సాధువులకు చదువురాదని, వారికి తమ ఇంగ్లీషు తెలియదని భావించారు. అంతే వారిద్దరూ వివేకానందుని చూసి ఇంగ్లీషులో నిందించడం మొదలుపెట్టారు.

సాధువులు భూమికి భారం లాంటివారని. ఇతరుల డబ్బుతో సాధువులు రైలులోని మొదటి తరగతిలో ప్రయాణిస్తుంటారని వారు ఆరోపించారు. ఇలా చాలాసేపు ఆంగ్లేయులిద్దరూ స్వామీజీ గురించి చెడుగా మాట్లాడారు. వివేకానందునికి వారు మాట్లాడిన ఆంగ్ల సంభాషణంతా అర్థమైంది కానీ వారి విమర్శలకు స్పందించకుండా మౌనం వహించారు. కొంతసేపటికి ఆ కంపార్ట్‌మెంట్‌లోకి టిక్కెట్‌ కలెక్టర్ వచ్చాడు. అతనితో వివేకానందుడు ఆంగ్లంలో మాట్లాడారు. ఇది చూసిన ఆ ఇద్దరూ మరింత ఆశ్చర్యపోయారు. తమ తప్పును గ్రహించారు. స్వామీజీని క్షమాపణలు కోరారు.

‘మీకు ఇంగ్లీష్ తెలుసు. మేము మీగురించి, చెడుగా మాట్లాడాం. అయినా మీరు మీరు మౌనంగా ఉన్నారు. మీరు మాకు ఎందుకు సమాధానం ఇవ్వలేదు?’ అని అడిగారు. వెంటనే వివేకానందుడు స్పందిస్తూ మీలాంటి వారి విమర్శలతో నాలోని సహనం పెరుగుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నా సహనం కోల్పోను. మీరు మీ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నేను వాటిని సహించాలని నిర్ణయించుకున్నాను. కోపం వస్తే నాకే నష్టం వాటిల్లేది. మన మధ్య వివాదం జరిగి, అది ముదిరి ఉంటే మరిన్ని సమస్యలు వచ్చేవి. అందుకే మౌనంగా ఉండిపోయాను’ అని వివేకానందుడు అన్నారు. ఈ ఉదాహరణ ద్వారా మనం సహనగుణానికున్న గొప్పతనం తెలుసుకోవచ్చు.

Updated Date - 2022-12-14T11:51:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising