ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరేళ్ల కొడుకు కోసం టైమ్ టేబుల్.. తల్లిపై నెటిజన్ల కామెంట్ల వెల్లువ!

ABN, First Publish Date - 2022-06-27T14:52:18+05:30

బాల్యంలో మనమంతా టైమ్ టేబుల్‌ను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాల్యంలో మనమంతా టైమ్ టేబుల్‌ను రూపొందించుకునే ఉంటాం. అందులో ఆడుకోవడానికి, చదవడం నుండి తినడం వరకు అన్నింటికీ టైమింగ్స్ రాసుకుంటాం. ఈ దినచర్యను అనుసరించడానికి తల్లిదండ్రులు పిల్లలకు సహకారం అందిస్తారు. ఇటువంటి ఉదంతాలకు సంబంధించిన అనేక వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి టైమ్ టేబుల్ ఒకటి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ టైం టేబుల్‌ని ఒక తల్లి తన ఆరేళ్ల కుమారుని కోసం తయారు చేసింది. 


ఈ టైమ్ టేబుల్ ఫోటో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రీడిట్ ఖాతాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ టైమ్ టేబుల్‌లో అలారం సమయం ఉదయం 7:50 అని రాసి ఉండగా, బెడ్‌పై నుంచి లేవడానికి సమయం 8:00 వరకు అని పేర్కొన్నారు, ఆ తర్వాత బ్రష్, అల్పాహారం, టీవీ చూడటం, పండ్లు తినడం, ఆడటం, పాలు తాగడం, టెన్నిస్ ఆడటం, హోం వర్క్ చేయడం, డిన్నర్, క్లీనింగ్, నిద్రపోయే సమయం గురించి ప్రస్తావించారు. అంతే కాకుండా ఈ టైం టేబుల్ ప్రకారం పిల్లాడు రోజంతా గడిపితే రివార్డుగా 10 రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇదే విధానాన్ని 7 రోజులు అనుసరిస్తే అతనికి రూ. 10కి బదులుగా 100 రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 

Updated Date - 2022-06-27T14:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising