ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking: దారుణం.. తన కొడుకు కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్న విద్యార్థిపై కసి.. చివరకు ఆ మహిళ ఎంత పని చేసిందంటే..

ABN, First Publish Date - 2022-09-04T20:39:56+05:30

పుదుచ్చేరి (Puducherry)లో ఓ మహిళ దారుణానికి పాల్పడింది. తన కొడుకు కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుదుచ్చేరి (Puducherry)లో ఓ మహిళ దారుణానికి పాల్పడింది. తన కొడుకు కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్న ఓ విద్యార్థిని విషం పెట్టి చంపింది. కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తన కొడుకు క్లాస్‌ టాపర్ చేత తాగించింది. ఆ డ్రింక్ తాగిన బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పుదుచ్చేరిలోని కరైకల్ నగర్‌కు చెందిన రాజేంద్రన్‌, మాలతి దంపతుల రెండో కుమారుడు మణికందన్‌ నెహ్రూనగర్‌లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ లో 8వ తరగతి చదువుతున్నాడు. 


ఇది కూడా చదవండి..

Swiggy Instamart లో కండోమ్స్‌ను తెగ ఆర్డర్ చేసేస్తున్నారట.. ఏ నగర వాసులు ఏమేమి ఆర్డర్ ఇస్తున్నారంటే..!


శనివారం ఉదయం స్కూలులో ఉండగానే ఆ బాలుడు వాంతులు చేసుకుని, కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం మణికందన్‌ను ఆసుపత్రికి తరలించింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో మణికందన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మణికందన్ తాగిన కూల్‌ డ్రింక్‌లో విష పదార్థాలు ఉన్నాయని తేలడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు నిందితురాలిని పట్టుకున్నారు. 


విక్టోరియా అనే మహిళ ఈ విష ప్రయోగానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. తన కొడుకు కంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయనే అక్కసుతో విక్టోరియా ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. విషం కలిపిన కూల్‌డ్రింక్‌ను స్కూల్‌లో ఉండే వాచ్‌మెన్‌ ద్వారా మణికందన్‌కు విక్టోరియా ఇప్పించింది. ఆమె పోలీసుల ఎదుట తన నేరాన్ని అంగీకరించింది. నిందితురాలు విక్టోరియాను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2022-09-04T20:39:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising