ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడేళ్ల చిన్నారిపై దాడి చేసిన కోతి.. కిడ్నాప్‌కు విఫలయత్నం

ABN, First Publish Date - 2022-04-23T22:24:07+05:30

బొమ్మ స్కూటర్‌తో ఇంటి బయట ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిని ఓ కోతి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే స్థానికులు అలర్ట్ కావడంతో చిన్నారిని వదిలి అది అడవిలోకి పారిపోయింది. ప్రస్తుతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: బొమ్మ స్కూటర్‌తో ఇంటి బయట ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిని ఓ కోతి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే స్థానికులు అలర్ట్ కావడంతో చిన్నారిని వదిలి అది అడవిలోకి పారిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



నైరుతి చైనాలో ఉన్న చాంగ్‌క్వింగ్ మున్సిపాలిటీలోని గ్రామప్రజలపై మంగళవారం మధ్యాహ్నం ఓ కోతి విరుచుకుపదింది. దాడి చేసి భయాందోళనలకు గురిచేసింది. అనంతరం ఇంటి బయట ఆడుకుంటున్న 3ఏళ్ల చిన్నారిపై దాడికి దిగింది. చిన్నారిని పడేసి, తనతో అడవిలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే స్థానికులు అలర్ట్ కావడంతో.. ఆ వానరం అక్కడ నుంచి పారిపోయింది. ఈ దృశ్యాలన్నీ స్థానికంగా ఉన్న కెమెరాలో రికార్డవగా ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఈ ఘటనపై గ్రామ ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు విషయాన్ని ఫారెస్ట్ సిబ్బందికి తెలియజేశారు. దీంతో ఫారెస్ట్ అధికారులు స్పందిస్తూ.. ఇకపై ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. ఇదిలా ఉంటే.. ఈ దాడిలో పాప స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. 




Updated Date - 2022-04-23T22:24:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising