ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ్యాజిక్ చూసి.. ఫన్నీ రియాక్షన్ ఇచ్చిన కోతి.. నెట్టింట వైరల్!

ABN, First Publish Date - 2022-02-04T23:13:30+05:30

కాలక్షేపం కోసం సాధారణంగా మనం మ్యాజిక్ షోలకు వెళ్తూ ఉంటాం. అక్కడ రకరకాల ట్రిక్కులతో మెజీషియన్ చేసే మ్యాజిక్ చూసి పొట్టచెక్కలయ్యేంత నవ్వుతాం. ఇపుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కాలక్షేపం కోసం సాధారణంగా మనం మ్యాజిక్ షోలకు వెళ్తూ ఉంటాం. అక్కడ రకరకాల ట్రిక్కులతో మెజీషియన్ చేసే మ్యాజిక్ చూసి పొట్టచెక్కలయ్యేంత నవ్వుతాం. ఇపుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే.. ప్రస్తుతం ఓ వానరానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి చేసిన మ్యాజిక్‌కు కోతి ఫన్నీ రియాక్షన్స్ ఇచ్చింది. అది చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 



మ్యాక్సిమెలియానో అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం మెక్సికన్ జూను సందర్శించాడు. అక్కడున్న జంతువులను చూస్తున్న క్రమంలో అతడికి ఓ కోతి కనిపించింది. ఈ క్రమంలో అద్దం దగ్గర నించొని సందర్శకులను గమనిస్తున్న వానరం దగ్గరకు అతడు వెళ్లాడు. అనంతరం చిన్న చిన్న ట్రిక్స్‌తో.. వానరం ముందు మ్యాజిక్ చేశాడు. ఆ మ్యాజిక్‌  గమనించిన వానరం.. ఫన్నీగా రియాక్షన్స్ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఈ మాయలోడు నా వెనక పడ్డాడేంట్రా బాబూ’ అని అనుకున్నట్టు ఉంది. అక్కడ నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఈ దృశ్యాలను కొందరు వీడియో తిసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.






Updated Date - 2022-02-04T23:13:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising