ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందమే ఆమెకు శత్రువట.. ఆవేదన వ్యక్తం చేసిన మోడల్!

ABN, First Publish Date - 2022-05-21T17:18:44+05:30

ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. దీని కోసం చాలామంది డబ్బును కూడా ఖర్చు చేస్తారు. ఇంకా అందంగా ఉంటే జనాలు కూడా ఇష్టపడతారని అనుకుంటారు. కానీ ఓ మహిళ విషయంలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. ఆమె అందమే ఆమెకు శత్రువుగా మారింది. అందంగా ఉన్న తనకు ఎక్కడా ఉద్యోగం దొరకడం లేదని ఆమె వాపోతోంది. దీనివెనుకనున్న కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. లండన్‌కు చెందిన ఈ మహిళ సోషల్ మీడియాలో 'జుజు బ్రెజిల్'గా ఫేమస్ అయ్యారు. జుజు వృత్తిరీత్యా మోడల్. 


అయితే జుజు తన అందం, హాట్‌నెస్ కారణంగా తెగ ఆందోళన చెందుతోంది, ఎందుకంటే వీటికారణంగా ఆమెకు ఉద్యోగం రావడం లేదట. తనపై అందరూ వివక్ష చూపుతున్నారని ఆమె తెలిపింది. టీవీ సీరియల్‌లో నటించాలనేది తన కల అని మోడల్ చెప్పింది. కానీ తన లుక్‌ వల్ల అవకాశాలు రావడం లేదన్నారు. తనను రియాల్టీ షోలలో చూడడానికి జనాలు ఇష్టపడరన్నారు. రకరకాల డ్రెస్సులు వేసుకున్నందుకు తనను బెదిరిస్తున్నారని ఆమె మీడియా ముందు వాపోయింది. హాట్‌గా ఉండటం వల్ల వివక్ష ఎదుర్కొంటున్నానని ఆమె పేర్కొన్నారు. ఇదిమాత్రమే కాదు, తాను ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు తన హాట్‌నెస్‌ని మాత్రమే చూస్తారన్నారు. కాగా ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షా 6 వేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. 

Updated Date - 2022-05-21T17:18:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising