ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొబైల్‌కు బానిసగా మారిన బాలుడు.. తండ్రి రీఛార్జ్ చేయించలేదని ఎంత పని చేశాడంటే..

ABN, First Publish Date - 2022-04-19T19:37:33+05:30

ప్రస్తుతం చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ మొబైల్ ఫోన్లతోనే జీవితాలను గడుపుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ మొబైల్ ఫోన్లతోనే జీవితాలను గడుపుతున్నారు. ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా గడపలేని పరిస్థితికి వెళ్లిపోయారు. ప్రపంచం మొత్తాన్ని కళ్ల ముందుకు తీసుకొస్తున్న స్మార్ట్ ఫోన్‌కు ఎంతో మంది యువతీయువకులు బానిసలుగా మారుతున్నారు. తాజాగా ఓ యువకుడు.. తండ్రి తన మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేయించలేదనే కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడు. 


మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు నిఖిల్ నాలుగు నెలల క్రితం తల్లిని కోల్పోయాడు. అనారోగ్యం కారణంగా తల్లి చనిపోవడంతో తండ్రితో కలిసి నివసిస్తున్నాడు. తండ్రి రోజు కూలీ. తండ్రి పనికి వెళ్లిపోయాక మొబైల్‌తోనే నిఖిల్ రోజంతా గడిపేవాడు. ఇటీవల నిఖిల్ మొబైల్‌లో ఇంటర్నెట్ ప్యాక్ వ్యాలిడిటీ అయిపోయింది. దీంతో మొబైల్ రీఛార్జ్ చేయించాలని తండ్రిని అడిగాడు. 


డబ్బులు లేకపోవడం వల్ల నిఖిల్ తండ్రి రీఛార్జ్ చేయించలేకపోయాడు. మూడ్రోజులుగా ఫోన్‌లో ఇంటర్నెట్ పనిచేయకపోవడంతో నిఖిల్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ డిప్రెషన్‌లో నిఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నాలుగు నెలల వ్యవధిలో భార్యను, కొడుకును కోల్పోయిన వ్యక్తి తీవ్రంగా విలపిస్తున్నాడు.   

Updated Date - 2022-04-19T19:37:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising