ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

47 ఏళ్లుగా తరగని అద్భుత రుచి... ఆ స్వీట్ ఘన చరిత్ర ఇదే...

ABN, First Publish Date - 2022-08-11T16:32:25+05:30

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఎవరిని అడిగినా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఎవరిని అడిగినా స్టాంప్‌డ్ పెడాస్ ఎక్కడ దొరుకుతాయో ఇట్టే చెబుతారు. ఘంటాఘర్ చౌక్‌ దగ్గర ప్రతిరోజూ దూరప్రాంతాల నుండి సైతం మిశ్రీలాల్ దుకాణానికి వచ్చి పెడా కొనుగోలు చేస్తుంటారు. కుంకుమపువ్వుతో చేసిన ఈ బంగారు రంగు స్టాంప్డ్ పెడాస్ రుచికి ఎంత బాగుంటాయో అంతే అందంగా కనిపిస్తాయి.. ఈ స్టాంపింగ్ పెడాస్‌కు ఘనమైన చరిత్ర ఉంది.


 ఈ దుకాణం 1927లో ప్రారంభమయ్యింది. ఈ దుకాణాన్ని తన తాత మిశ్రీలాల్ ప్రారంభించారని మూడవ తరానికి చెందిన సందీప్ అరోరా చెప్పారు.1927లో మిశ్రిలాల్ అరోరా ఈ దుకాణంలో నెయ్యి కచోరీ, రబ్రీ, కోఫ్తా విక్రయించేవారు. వీటితోపాటు ఇంగ్లండ్ నుండి అనేక రుచుల సోడాలను తీసుకువచ్చి విక్రయించడం ప్రారంభించాడు. 1960లో మఖానియా, లస్సీ విక్రయాలు ప్రారంభించాడు. 1975లో దాదా మిస్రీలాల్‌కు పెడాస్ తయారు చేయాలనే ఆలోచన వచ్చిందని సందీప్ తెలిపారు. ఎన్నో ప్రయోగాల తర్వాత మావాకు కుంకుమపువ్వు జోడించి, బంగారు రంగు పెడాస్ తయారు చేయడం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ నుంచి ప్రత్యేక స్టాంపును తయారు చేయించి వాటిపై మిశ్రిలాల్ పెడాస్ అని ముద్రింపజేశాడు. మారుతున్న ట్రెండ్‌లో భాగంగా షాప్‌కి ఆన్‌లైన్ ఆర్డర్లు కూడా రావడం మొదలయ్యాయి. విదేశీ పర్యాటకులు సైతం ఈ పెడాస్‌ను అమితంగా ఇష్టపడుతుంటారు. కేవలం పాలతో తయారు చేసిన ఈ పెడా ఉపవాస సమయంలో తినవచ్చని సందీప్ తెలిపారు.

Updated Date - 2022-08-11T16:32:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising