ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16 ఏళ్ల బాలికని ఎంగేజ్మెంట్ చేసుకున్న యువకుడు.. పెళ్లికి ముందే ఆమెను ఏం చేశాడంటే..

ABN, First Publish Date - 2022-02-15T05:35:26+05:30

ఒక 16 ఏళ్ల బాలిక అందాన్ని చూసి ఒక యువకుడు ప్రేమించాడు. ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నాడు. కానీ ఆ తరువాత అతని నిజ స్వరూపం చూపించాడు. ఆ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసి ఇక పెళ్లి చేసుకునేదిలేదని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక 16 ఏళ్ల బాలిక అందాన్ని చూసి ఒక యువకుడు ప్రేమించాడు. ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నాడు. కానీ ఆ తరువాత అతని నిజ స్వరూపం చూపించాడు. ఆ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసి ఇక పెళ్లి చేసుకునేదిలేదని చెప్పాడు. ఈ ఘటన హర్యాణా రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. హర్యాణా రాష్ట్రంలోని ఫతేహాబాద్ నగరానికి చెందిన లఖ్విందర్ అనే యువకుడు సమీపంలోని ఒక గ్రామానికి చెందిన రేష్మ(16, పేరు మార్చబడినది) అనే బాలిక అందం చూసి ఆమెను ప్రేమించాడు. కానీ ఆ అమ్మాయి లఖ్విందర్‌‌‌ని తిరిగి ప్రేమించలేదు. దీంతో లఖ్విందర్‌‌‌ తన తల్లితో కలిసి రేష్మ తండ్రితో పెళ్లి విషయం మాట్లాడాడు. రేష్మ తండ్రి పేదరికం కారణంగా పెళ్లికి ఒప్పుకున్నాడు. అలా  లఖ్విందర్‌, రేష్మల నిశ్చితార్థం జరిగింది.‌


ఆ తరువాత లఖ్విందర్‌‌‌ తన తల్లితో కలిసి రేష్మ ఇంటికి పలుమార్లు వెళ్లి.. పెళ్లిని వాయిదా వేశారు. ఈ క్రమంలో రేష్మని లఖ్విందర్‌‌‌ బయటికి షాపింగ్ కోసం తీసుకెళ్లేవాడు. షాపింగ్ పేరుతో బయటికి తీసుకెళ్లి రేష్మపై అత్యాచారం చేశాడు. ఈ విషయం రేష్మ తన తండ్రితో చెప్పడంతో లఖ్విందర్‌‌‌పై గ్రామంలో పంచాయితీ పెద్దలు అగ్రహం వ్యక్తం చేశారు. కానీ లఖ్విందర్‌..‌‌ రేష్మ వ్యక్తిత్వం మంచిది కాదని.. అమెకు పరాయి పురుషులతో అక్రమ సంబంధాలున్నాయని పంచాయితీలో ఆరోపించాడు. చివరగా తను రేష్మను వివాహం చేసుకోవడం కుదరదని చెప్పి వెళ్లిపోయాడు.


రేష్మ తండ్రి లఖ్విందర్‌‌‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రేష్మ ఒక మైనర్ కావడంతో పోలీసులు లఖ్విందర్‌‌‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


Updated Date - 2022-02-15T05:35:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising