ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలు శాకాహార‌మా? మాంసాహార‌మా?... ఎవ‌రి వాద‌న స‌రైన‌ది?... చివ‌రికి తేలిందేమిటంటే...

ABN, First Publish Date - 2022-11-27T10:56:38+05:30

త‌ల్లులంతా పిల్ల‌ల‌కు త‌ప్ప‌నిస‌రిగా పాలు తాగిస్తుంటారు. పాలు తాగితే వారు దృఢంగా ఉంటారని, త్వరగా ఎదుగుతారని చెబుతుంటారు. పాల‌లో చాలా పోషకాలు ఉన్నాయి. పాలు ఆరోగ్యకరమైన పానీయం అని అంటారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త‌ల్లులంతా పిల్ల‌ల‌కు త‌ప్ప‌నిస‌రిగా పాలు తాగిస్తుంటారు. పాలు తాగితే వారు దృఢంగా ఉంటారని, త్వరగా ఎదుగుతారని చెబుతుంటారు. పాల‌లో చాలా పోషకాలు ఉన్నాయి. పాలు ఆరోగ్యకరమైన పానీయం అని అంటారు శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ జన్మదినాన్ని భారతదేశంలో ప్రతి సంవత్సరం పాల దినోత్సవంగా నవంబర్ 26 న జ‌రుపుకుంటారు. కురియ‌న్‌ను మిల్క్‌మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అయితే పాలు శాకాహారమా, లేదా మాంసాహారమా అనే అంశంపై చ‌ర్చ జ‌రుగుతుంటుంది. పాలు శాకాహారం అని కొందరు నమ్ముతారు. అదే సమయంలో కొంతమంది దీనిని మాంసాహారంగా ప‌రిగ‌ణిస్తారు. దీనిపై రక‌ర‌కాల వాదనలు వినిపిస్తుంటాయి. వాటికి సంబంధించిన కొన్ని అంశాల‌ను ఇప్పుడు చూద్దాం.

శాకాహారులు పాలను శాకాహారంగా పరిగణించడం చాలా సంతోషక‌ర‌మైన విష‌యం. ఎందుకంటే వారు అలా భావించ‌డం ద్వారా అపరాధ భావ‌న‌ నుండి విముక్తి పొందుతారు. జీవితాంతం పాలను ఆనందంగా తాగుతారు. ప్రజల్లో శాకాహారంపై అవగాహన పెరుగుతున్న‌ప్ప‌టినుంచి పాలపై అభ్యంతరాలు కూడా పెరగడం మొదలైంది. ఇక్క‌డ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పాలను శాకాహారం వర్గం నుండి మినహాయించి, మాంసాహారం అని పిలవడం ద్వారా మాంసాహారులు సంతోష‌ప‌డ‌తారు. దీని వల్ల మాంసాహారం తినేవారిలో అపరాధభావం తగ్గుతుంద‌నే భావన ఉంది. పాలను మాంసాహారంగా పరిగణించే వ్యక్తుల ఆలోచనలను ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. శాకాహారం- మాంసాహారం అనే పదాలు ఏ ఆహారపానీయాలను ఏ వర్గంలో ఉంచవచ్చో స్పష్టంగా తెలియజేస్తాయి. కాయగూరలు, పండ్లు, ధాన్యాలు, నీరు వంటి పదార్థాలు ఏ జీవి నుండి కాకుండా ప్రకృతి నుండి లభించిన‌వి అయి ఉంటాయి. ఏ ప్రాణిని చంపకుండా లేదా హింసించకుండా ల‌భించేది శాకాహార‌మ‌ని స్పష్టమవుతుంది. మాంసం, గుడ్లు, పాలు మొద‌లైన‌వి చెట్ల నుంచి ఉత్ప‌త్తి కావు. వాటిని పొందాలంటే ఏదో ఒక జీవిని చంపాలి లేదా బాధపెట్టాలి. ఆ త‌రువాతే ఈ ఆహారం మన డైనింగ్ టేబుల్‌కి చేరుకుంటుంది.

2. శాకాహారం పొందేందుకు మ‌నం భూమిలో విత్తనాలను నాటడం ద్వారా వ్య‌వ‌సాయం చేసి పండ్లు లేదా కూరగాయలు లేదా ధాన్యాలను సేక‌రిస్తాం. మనకు పండ్లు, కూరగాయలు లేదా ధాన్యాలు లభించే స‌మ‌యంలో మనం వేటినీ బాధ‌పెట్టం. అయితే మాంసాహారం పొందాలంటే, జంతువుల‌ను చంపాలి.

3. పాలు కూడా రక్తం వంటి ద్రవ కణాల సమూహం. కాబట్టి ఇది శాకాహారం కాదు, ఇది మాంసాహారం. జంతువుల నుంచి లభించే పాలు మాంసాహారం. శాకాహార పాలు అంటే సోయాబీన్ లేదా వేరుశెనగ నుండి పొందవచ్చు. ఈ ర‌క‌మైన పాలు ఏదో ఒక‌ జంతువు నుండి పొందిన పాల కంటే ఎక్కువ పోష‌క లక్షణాలను కలిగి ఉంటాయి. పాలను మాంసాహారంగా పరిగణించేందుకు ఇలాంటి వాదనలు బ‌లాన్నిస్తున్నాయి.

Updated Date - 2022-11-27T10:56:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising