ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రియురాలి కోసం కిడ్నీ దానం చేసిన ప్రేమికుడు.. చివరికి అతడి పరిస్థితి ఏమైందంటే..

ABN, First Publish Date - 2022-01-20T06:26:44+05:30

టిక్‌టాక్‌లో ఓ యువకుడు పోస్ట్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అతను తన విఫల ప్రేమ కథ గురించి చెప్పాడు. ఆ ప్రేమ కథ చాలా మంది గుండెలను కదిలిస్తోంది. ఎంతగా అంటే.. దానికిప్పుడు 14 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టిక్‌టాక్‌లో ఓ యువకుడు పోస్ట్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అతను తన విఫల ప్రేమ కథ గురించి చెప్పాడు. ఆ ప్రేమ కథ చాలా మంది గుండెలను కదిలిస్తోంది. ఎంతగా అంటే.. దానికిప్పుడు 14 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇంతకీ అతని ప్రేమకథలో అంత విషాదం ఏమై ఉంటుందో తెలుసా?..


వివరాల్లోకి వెళితే..  మెక్సికోలో ఉజైల్ మార్టినెజ్ ఒక స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అతడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి తల్లికి కిడ్ని చెడిపోతే.. ప్రేమికుడిగా ఉజైల్ తన ప్రియురాలి కోసం మహాత్యాగం చేశాడు. ప్రియురాలి తల్లి కోసం తన కిడ్నీ దానం చేసి గొప్ప ప్రేమికుడనిపించుకున్నాడు. కానీ కిడ్నీ దానం చేసిన కొన్ని వారాల తరువాత ఉజైల్ ప్రియురాలు మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇది తెలిసిన ఉజైల్‌కు మతి పోయింది. అప్పుడు మనస్తాపం చెందిన ఉజైల్ తనకు ప్రేమలో ఎదురైన చేదు అనుభవం గురించి టిక్‌టాక్‌లో వీడియో షేర్ చేశాడు.


ఇప్పుడా వీడియోకి నెటిజెన్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఆ వీడియో చూసిన వారంతా ఉజైల్ కోసం భావోద్వేగంగా కామెంట్లు పెడుతున్నారు. అతని ప్రియురాలు చాలా దురదృష్టవంతురాలని ఒకరు కామెంట్ చేస్తే.. ఉన్న ఒక కిడ్నీ అయిన కాపాడుకోమని మరొకరు హాస్యం చేశారు. 


ఉజైల్ మాత్రం తాను జీవితంలో అన్ని మరిచిపోయి ముందుకు సాగిపోయానని.. తన ప్రియురాలిపై ఎటువంటి పగలేదని  చెప్పాడు.

Updated Date - 2022-01-20T06:26:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising