ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల నెలా కడుపు నొప్పితో బాధపడుతున్న 33ఏళ్ల వ్యక్తి.. మూత్రంలో రక్తం కూడా వస్తుండటంతో డాక్టర్ వద్దకు.. వైద్య పరీక్షలు చేసి షాక్

ABN, First Publish Date - 2022-07-10T15:56:34+05:30

ఓ వ్యక్తి ప్రతి నెలలో రెండు మూడు రోజులు తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. అదే సమయంలో మూత్రంలో రక్తం కూడా వస్తుండటాన్ని గమనించాడు. అయితే దాన్ని అతడు లైట్ తీసుకున్నాడు. చిన్న విషయమే అనుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యక్తి ప్రతి నెలలో రెండు మూడు రోజులు తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. అదే సమయంలో మూత్రంలో రక్తం కూడా వస్తుండటాన్ని గమనించాడు. అయితే దాన్ని అతడు లైట్ తీసుకున్నాడు. చిన్న విషయమే అనుకున్నాడు. ఈ క్రమంలో 20ఏళ్లు గడిచిపోయాయి. అయినప్పటికీ ఆ సమస్య నుంచి అతడికి విముక్తి లభించలేదు. దీంతో కొద్ది రోజుల క్రితం వైద్యుడిని సంప్రదించాడు. ఈ నేపథ్యంలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా.. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



చైనాకు చెందిన ఓ వ్యక్తికి ప్రస్తుతం 33ఏళ్లు. అతడికి దాదాపు 13ఏళ్ల వయసు ఉన్నపుడు.. తీవ్ర కడుపు నొప్పి వచ్చింది. అదే సమయంలో మూత్రంలో రక్తం కూడా వచ్చింది. అయితే ఆ విషయాన్ని అతడు కుటుంబ సభ్యులకు చెప్పకుండా తేలిగ్గా తీసుకున్నాడు. ఈ క్రమంలో 20ఏళ్లు గడిచిపోయాయి. ఇన్నేళ్ల కాలంలో ప్రతి నెలా రెండు మూడు రోజులు అతడికి ఈ సమస్య రిపీట్ అవుతూనే ఉంది. దీంతో అతడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. వైద్యుడిని సంప్రదించి.. తన సమస్యను వివరించాడు. అతడి సమస్య విన్న వైద్యులు తొలుత అపెండిక్స్ అనుకున్నారు. వైద్య పరీక్షల్లో కడుపు నొప్పి అపెండిక్స్ వల్ల కాదని తేలింది. దీంతో మరిన్ని పరీక్షలు చేశారు. అందులో షాకింగ్ విషయం బయటపడింది. సదరు వ్యక్తి.. అండాశయంతోపాటు గర్భాశయం కలిగి ఉన్నడన్న విషయం వెల్లడైంది. అంతేకాకుండా అతడికి 20ఏళ్లుగా పీరియడ్స్ వస్తున్నాయని.. మూత్రంలో రక్తం రావడానికి కారణం ఇదే అని వైద్యులు గ్రహించారు. విషయాన్ని అతడికి వివరించారు. అనంతరం మూడు గంటలపాటు వైద్య పరీక్షలు జరిపి.. అండాశయం, గర్భాశయాన్ని తొలగించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగుందని వైద్యులు వెల్లడించారు. 


Updated Date - 2022-07-10T15:56:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising