ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రో మంటలకు చెక్.. గుర్రం స్వారీ చేసుకుంటూ విధులకు వెళ్తున్న మహారాష్ట్ర ఉద్యోగి!

ABN, First Publish Date - 2022-03-16T22:50:23+05:30

పెట్రోల్ ధరలు రోజురోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. దేశంలో ఇప్పటికే చాలా చోట్ల పెట్రో ధరలు సెంచరీ దాటేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెట్రోల్ ధరలు రోజురోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. దేశంలో ఇప్పటికే చాలా చోట్ల పెట్రో ధరలు సెంచరీ దాటేశాయి. దీంతో సామాన్యుడి పరిస్థితి దయనీయంగా మారిపోయింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెట్రోల్ ధరలు మరింత ఎగబాకుతాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన యూసఫ్ అనే వ్యక్తి గుర్రంపై విధులకు హాజరవుతున్నాడు. 


మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన యూసఫ్ అనే వ్యక్తి స్థానిక కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. గతేడాది లాక్‌డౌన్ సమయంలో రవాణా సౌకర్యాలు లేకపోవడంతో రూ.40 వేలతో ఓ గుర్రాన్ని కొనుగోలు చేశాడు. దానికి `జిగర్` అని పేరు పెట్టాడు. దాని మీదే విధులకు హాజరయ్యేవాడు. ఇక, పెట్రోల్ ధరలు భరించలేక తాజాగా మరోసారి దానిని బయటకు తీశాడు. ఆ గుర్రం మీద రోడ్లపై స్వారీ చేసుకుంటూ విధులకు హాజరవుతున్నాడు. 


`గుర్రం స్వారీ పెట్రోల్ ధరల నుంచి మనల్ని కాపాడుతుంది. చాలా తక్కువ ఖర్చుతో ప్రయాణం పూర్తవుతుంది. అంతేకాదు గుర్రం స్వారీ వల్ల మనం మరింత ఫిట్‌గా ఉంటామ`ని యూసఫ్ చెప్పాడు. బైక్‌కు అయ్యే  పెట్రో ధరల కంటె తన గుర్రానికి అయ్యే ఖర్చు చాలా తక్కువని తెలిపాడు. రాబోయే రోజుల్లో పెట్రోల్ డబుల్ సెంచరీ కొడుతుందేమోనని షేక్ యూసుఫ్ అన్నాడు.

Updated Date - 2022-03-16T22:50:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising