ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాబోయ్.. ఇదేం అలవాటు.. అతను ఆహారంగా వేటిని తీసుకుంటాడో తెలిస్తే షాకవడం ఖాయం!

ABN, First Publish Date - 2022-03-07T23:41:28+05:30

`మ్యాన్ వర్సస్ వైల్డ్` అంటూ బేర్ గ్రిల్స్ అడవుల్లో చేసే సాహసాల గురించి అందరికీ తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

`మ్యాన్ వర్సస్ వైల్డ్` అంటూ బేర్ గ్రిల్స్ అడవుల్లో చేసే సాహసాల గురించి అందరికీ తెలిసిందే. ఆహారం లేనపుడు అతను అడవిలో దొరికే చిన్న చిన్న ప్రాణులను కాల్చుకుని తింటుంటాడు. ఒక్కోసారి పచ్చివి కూడా తినేస్తుంటాడు. అచ్చం అలాంటి వ్యక్తే రాజస్థాన్‌లో ఉన్నాడు. అజ్మీర్‌కు సమీపంలోని భగవాన్‌గంజ్ ప్రాంతానికి చెందిన కరణ్ నహారియా అనే వ్యక్తి విషపూరిత ప్రాణులనే ఆహారంగా తీసుకుంటాడు. అతడిని స్థానికులు `పాయిజన్ మ్యాన్` అని పిలుస్తుంటారు. 


పాములను, తేళ్లను, బల్లులను, పీతలను కరణ్ అలవోకగా తినేస్తుంటాడు. ఇతను తన గ్రామంలో జంతువుల ఫామ్‌ను కూడా నడుపుతున్నాడు. విషపూరితమైన జంతువులను రోజులో ఒక్కసారైనా తింటానని, లేకపోతే బతకలేనని కరణ్ చెబుతున్నాడు. చిన్న వయసు నుంచే తనకు ఆ అలవాటు ఉందని, అందువల్లే ఆ విషం తనపై ప్రభావం చూపించడం లేదని తెలిపాడు. పేద కుటుంబంలో పుట్టిన తనకు చిన్న వయసులో ఆహారం దొరికేది కాదని, అందుకే జంతువులను తిని ఆకలి తీర్చుకునేవాడినని చెప్పాడు. 


14 ఏళ్ల వయసులో రోజూ అడవికి వెళ్లి పాములను, తేళ్లను పట్టుకుని తినేవాడినని చెప్పాడు. ఇంట్లో బల్లులను కూడా తింటానని, వాటితో సూప్ చేసుకుని తాగుతానని చెప్పాడు. గతంలో తనను రెండు సార్లు ప్రమాదకర పాములు కాటేశాయని, అయినా తనకేం కాలేదని తెలిపాడు. తన కొడుకు రేహాన్‌ను కూడా కరణ్ తన లాగే తయారు చేస్తున్నాడు. వీరికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   

Updated Date - 2022-03-07T23:41:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising