ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Teacher beaten by students: లెక్కల్లో తక్కువ మార్కులు వేశారని మాస్టర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్థులు.. వీడియో వైరల్

ABN, First Publish Date - 2022-08-31T23:25:14+05:30

పాఠశాలలో విద్యార్థులు సరిగ్గా చదవకపోయినా, హోం వర్క్ చేయకపోయినా పనిష్మెంట్ తప్పదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాఠశాలలో విద్యార్థులు సరిగ్గా చదవకపోయినా, హోం వర్క్ చేయకపోయినా పనిష్మెంట్ తప్పదు. ఒకవేళ పరీక్షలో ఫెయిల్ అయితే టీచర్ చేతిలో విద్యార్థులకు దెబ్బలు తప్పవు.  అయితే ఝార్ఖండ్‌లో కొందరు విద్యార్థులు తమను ఫెయిల్ చేసిన ఉపాధ్యాయుడిని చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ ఘటన వైరల్‌గా మారింది. జార్ఖండ్‌లోని (Jharkhand) దుమ్కా జిల్లాలోని రెసిడెన్షియల్ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Shocking: ఇలాంటి వ్యాధి ఎవరికీ ఉండదేమో.. ఆమె రోజులో 23 గంటలు మంచం పైనే.. కిందకు దిగితే ఆమె పరిస్థితి ఏంటంటే..


స్థానిక రెసిడెన్షియల్ స్కూలుకు చెందిన ఉపాధ్యాయుడు సుమన్ కుమార్ 9, 10 తరగతులకు గణితం (Maths Teacher)బోధిస్తుంటాడు. తాజాగా ప్రకటించిన పరీక్షా ఫలితాల్లో పదో తరగతిలో ఉన్న 32 మంది విద్యార్థులకు గాను 11 మంది ఫెయిల్ అయ్యారు. వీరంతా సుమన్‌పై కోపం పెంచుకున్నారు. సుమన్ తమను కావాలనే ఫెయిల్ చేశాడని వారంతా కోపంతో రగిలిపోయారు. దీంతో విద్యార్థులందరూ కలిసి సుమన్‌ను, స్కూల్ క్లర్క్‌ను సోమవారం మధ్యాహ్నం ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ వారిద్దరినీ చెట్టుకు కట్టేసి (Teacher beaten by students) కొట్టారు.


ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. విద్యా శాఖ ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని సదరు ఉపాధ్యాయుడిని విచారించారు. అయితే, విద్యార్థుల భవిష్యత్తు పాడు చేయడం ఇష్టం లేక సుమన్ ఈ ఘటనపై ఫిర్యాదు చేయలేదు. దీంతో పోలీసులు సైలెంట్ అయ్యారు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవడంతో పాఠశాలకు రెండు రోజులు సెలవులు ఇచ్చారు. 

Updated Date - 2022-08-31T23:25:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising