ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రియురాలి ఇంటి ముందు ఉరి వేసుకున్న వివాహితుడు... ఇది హత్యే అంటున్న భార్య... పోలీసులు ఏమంటున్నారంటే...

ABN, First Publish Date - 2022-07-30T16:48:40+05:30

ఒడిశాలోని రూర్కెలాలో కలకలం చెలరేగే ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒడిశాలోని రూర్కెలాలో కలకలం చెలరేగే ఘటన చోటుచేసుకుంది. ఒక వివాహితుడి మృతదేహం అతని ప్రియురాలి ఇంటి ముందు చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఇది హత్యేనని మృతుడి భార్య ఆరోపిస్తోంది. రూర్కెలా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన రూర్కెలా నగరంలోని సెక్టార్-15లోని శివాజీ నగర్‌లో జరిగింది. మృతుడిని పోలీసులు సోను బాదిక్‌గా గుర్తించారు. మీడియాకు అందిన సమాచారం మేరకు చెట్టుకు వేలాడుతున్న సోను బాదిక్ మృతదేహాన్ని స్థానికులు గమనించారు. 


ఈ వార్త ఆ ప్రాంతంలో దావానలంలా పాకిపోయింది. స్థానికులు ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంనకు తరలించారు. ఇది  ప్రేమ వ్యవహారంగా కనిపిస్తోందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వివాహితుడు సోను తన ప్రియురాలికి పెళ్లి ప్రపోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె నిరాకరించడంతో అతను ఆమె ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరివేసుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన భర్త హత్యకు గురయ్యాడని సోనూ బారిక్ భార్య ఆరోపిస్తోంది. ఓ మహిళతో తన భర్త సంబంధం పెట్టుకున్నాడని, ఈ కారణంగానే అతనిని ఎవరో హత్య చేసి, మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి, ఈ ఘటనను  ఆత్మహత్యగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది. ఈ ఉదంతంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసిన తర్వాతనే అతని మరణానికి ఖచ్చితమైన కారణం తెలియనుందని పోలీసులు చెబుతున్నారు. 

Updated Date - 2022-07-30T16:48:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising