ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు పిల్లలు.. భర్తను వదిలి మామతో పారిపోయిన యువతి.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-05-27T09:12:45+05:30

ఇద్దరు పిల్లలు, భార్యతో తన ఇంట్లో ఎంతో హాయిగా జీవితం గడిపే ఆ యువకుడిని నలుగురు హేళనగా మాట్లాడారు. ఆ అవమానం తట్టుకోలేక ఇంటికి వెళ్లి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇద్దరు పిల్లలు, భార్యతో తన ఇంట్లో ఎంతో హాయిగా జీవితం గడిపే ఆ యువకుడిని నలుగురు హేళనగా మాట్లాడారు. ఆ అవమానం తట్టుకోలేక ఇంటికి వెళ్లి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు ఒక ఉత్తరంలో తనను మోసం చేసిన వారిని శిక్షించాలని పోలీసులను కోరాడు. ఇంతకీ ఆ ఉత్తరంలో ఏముందంటే..


వివరాల్లోకి వెళితే.. బీహార్ రాజధాని పట్నా నగరంలో నివసించే కుందన్ సింగ్(28) అనే యువకుడు తన భార్య, ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవించేవాడు. కుందన్ సింగ్ బాబాయ్(తండ్రి సోదరుడు) జస్వంత్ సింగ్ తరుచూ కుందన్ సింగ్ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో కుందన్ సింగ్ భార్యతో జస్వంత్ సింగ్‌కి వివాహేతర సంబంధం ఏర్పడింది. కానీ ఈ విషయం కొంత కాలానికే అందరికీ తెలిసిపోయింది. గ్రామంలో జస్వంత్ సింగ్, తనకు వరుసకు కోడలయ్యే కుందన్ భార్యతో చెట్టాపట్టాలేసుకొని తిరిగేవాడు.


ఆ గ్రామ ప్రజలంతా ఇది చూసి కుందన్ సింగ్‌పి ఎగతాళి చేసేవారు. ఒకరోజు కుందన్ సింగ్ తన భార్యతో ఈ విషయమై గొడవపడ్డాడు. మరోసారి తన బాబాయ్‌తో మాట్లాడకూడదని ఆమెపై కోపడ్డాడు. కానీ మరుసటిరోజే జస్వంత్ సింగ్ వారింటికి వచ్చి కుందన్ సింగ్‌ని చంపేస్తానని బెదిరించి కుందన్ సింగ్ భార్యను తనతో తీసుకెళ్లిపోయాడు. అలా వెళ్లిన ఆమె రెండు రోజులైనా తిరిగిరాలేదు. 


ఆ తరువాత కుందన్ సింగ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్య ఇల్లు వదిలి జస్వంత్ సింగ్‌తో పారిపోయిందని ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు అతడిని ఎగతాళి చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటి వచ్చిన కుందన్ సింగ్‌ని అతని ఇరుగుపొరుగువారు కూడా అవమానించారు. ఈ అవమానాలు భరించలేక కుందన్ సింగ్ విషం తాగి చనిపోయాడు. కానీ చనిపోయేముందు తన చావుకి తన భార్య, బాబాయ్ జస్వంత్ సింగ్ కారణమంటూ పోలీసులకు ఒక లేఖ రాశాడు.


కుందన్ సింగ్ రాసిన లేఖ ఆధారంగా పోలీసులు జస్వంత్ సింగ్, కుందన్ సింగ్ భార్యని అరెస్టు చేశారు. వారిపై కుందన్ సింగ్‌ని ఆత్మ హత్యకు ప్రేరేంపించునందుకు కేసు నమోదు చేశారు.


Updated Date - 2022-05-27T09:12:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising