ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Wife Missing: నా భార్య కనిపించడం లేదంటూ ఓ భర్త ఫిర్యాదు.. జైపూర్ నుంచి తీసుకొచ్చిన పోలీసులు.. ఎందుకు వెళ్లావని అతడు నిలదీస్తే..

ABN, First Publish Date - 2022-07-26T23:15:37+05:30

రాజస్థాన్ (Rajasthan)కు చెందిన యువకుడికి, బీహార్ (Bihar)కు చెందిన యువతికి రెండేళ్ల కిందట సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజస్థాన్ (Rajasthan)కు చెందిన యువకుడికి, బీహార్ (Bihar)కు చెందిన యువతికి రెండేళ్ల కిందట సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకున్నారు. నాలుగు నెలల కిందట వారిద్దరూ తల్లిదండ్రులు కూడా అయ్యారు. అయితే ఇటీవల ఆ మహిళ తన బిడ్డతో సహా అదృశ్యమైంది. ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొబైల్ లోకేషన్‌ను ట్రేస్ చేసిన పోలీసులు ఆమె ఆచూకీ తెలుసుకున్నారు. ఆమె ఎక్కడకు వెళ్లిందో తెలుసుకుని ఆమె భర్తతో పాటు పోలీసులు కూడా షాకయ్యారు. 


ఇది కూడా చదవండి..

Young Man Shameful Act: గేదెపై ఓ యువకుడి అత్యాచారం.. అతడి నిర్వాకం ఎలా బయటపడిందంటే..


కోటకు చెందిన యువకుడు రెండేళ్ల క్రితం సోషల్ మీడియాలో పరిచయమైన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ నాలుగు నెలల క్రితం ఓ కూతురు జన్మించింది. కాగా, పెళ్లై, ఓ బిడ్డకు తల్లి కూడా అయిన మహిళ కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన 20 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. అతడిని కలుసుకునేందుకు ఏకంగా జైపూర్ వెళ్లిపోయింది. భర్తకు చెప్పకుండా కూతురిని తీసుకుని ఈ నెల 12న ఇంట్లో నుంచి పారిపోయింది. భార్య, కూతురు కనిపించకపోవడంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మొబైల్ లొకేషన్ ట్రేస్ చేసి ఆ యువతి జైపూర్‌లో ఉన్నట్టు తేల్చిన పోలీసులు ఆమెను పట్టుకున్నారు. ఆమె దగ్గర ఉన్న చిన్నారిని ఛైల్డ్ వెల్ఫేర్ కమిషన్‌కు అప్పగించారు. ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో ఆ మహిళ తన భర్తతో కలిసి ఉండేందుకు అంగీకరించింది.  

Updated Date - 2022-07-26T23:15:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising