ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ ప్రేమికుడిని ఇంటికి పిలిచి షాకింగ్ పని చేసింది.. విషయం బయటపడడంతో కటకటాల పాలైంది!

ABN, First Publish Date - 2022-03-08T20:01:18+05:30

ఆమె వివాహిత.. ఇటీవలె పుట్టింటికి వెళ్లింది.. అక్కడకు తన మాజీ ప్రేమికుడిని ఆహ్వానించింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమె వివాహిత.. ఇటీవలె పుట్టింటికి వెళ్లింది.. అక్కడకు తన మాజీ ప్రేమికుడిని ఆహ్వానించింది.. ఎంతో సంబరంగా వెళ్లిన ఆ యువకుడికి అక్కడ షాకింగ్ అనుభవం ఎదురైంది.. అతడిని ఆమె కుటుంబ సభ్యులందరూ కలిసి చంపేశారు.. అనంతరం అతడి మృతదేహాన్ని కాలువలో పడేశారు.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియురాలి చేతిలో అతను హతమయ్యాడని తేల్చారు. 


గ్రేటర్ నోయిడా పరిధిలోని సూరజ్‌పూర్‌కు చెందిన రాబిన్ కాలేజీలో చదువుకునే రోజుల్లో అదే ప్రాంతానికి చెందిన మోనిక అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమె కూడా రాబిన్‌ను ప్రేమించింది. వారిద్దరూ పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. అయితే మోనికా తల్లిదండ్రులు ఆమెకు వేరే వ్యక్తితో వివాహం చేశారు. దాంతో రాబిన్‌ను మర్చిపోయి మోనిక సంసార జీవితాన్ని ప్రారంభించింది. అయితే రాబిన్ మాత్రం మోనికను మర్చిపోలేదు. ఆమె వివాహిత అనే విషయం తెలిసి కూడా తరచుగా ఫోన్లు చేసేవాడు. 


రోజూ ఆమె మొబైల్ నెంబర్‌కు మెసేజ్‌లు పంపేవాడు. భర్తను వదిలేసి తనతో రాకపోతే ప్రైవేట్ ఫొటోలను బయటపెడతానని బెదిరించాడు. భర్తకు ఆ విషయం తెలిస్తే తన సంసారానికి ముప్పని భావించిన మోనిక తన సోదరులు, తల్లితో విషయం చెప్పింది. పథకం ప్రకారం గత నెల 27న రాబిన్‌ను మోనిక తన పుట్టింటికి ఆహ్వానించింది. అక్కడ మోనిక, ఆమె తల్లి, ముగ్గురు సోదరులు రాబిన్‌ గొంతు కోసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేశారు. రాబిన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ కాల్స్ ఆధారంగా మోనికను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో మోనిక కుటుంబ సభ్యులను వారు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-03-08T20:01:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising