ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమ పేరుతో యువకుడిని బ్లాక్ మెయిల్ చేసిన వివాహిత.. అతనితో ఏం చేయించేదంటే..

ABN, First Publish Date - 2022-02-17T05:41:31+05:30

ఆమె ఒక వివాహిత. భర్త, ఒక ఎదిగిన కొడుకు కూడా ఉన్నాడు. అయినా ఒక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొద్ది కాలం తరువాత ఆ యువకుడు ఆమెను వదిలి వెళ్లిపోవాలని చూశాడు. కానీ ఆ మహిళ అతడిని బ్లాక్ బెయిల్ చేయడం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమె ఒక వివాహిత. భర్త, ఒక ఎదిగిన కొడుకు కూడా ఉన్నాడు. అయినా ఒక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొద్ది కాలం తరువాత ఆ యువకుడు ఆమెను వదిలి వెళ్లిపోవాలని చూశాడు. కానీ ఆ మహిళ అతడిని బ్లాక్ బెయిల్ చేయడం ప్రారంభించింది. తనను వదిలి వెళ్లిపోతే.. అతనిపై అత్యాచారం కేసు పెడతానని బెదిరించింది. దీంతో ఆ యువకుడు ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు.


వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోని ఆరంగ్ ప్రాంతంలో ఫిబ్రవరి 9న పోలీసులకు ఒక మహిళ(38) మృతదేహం లభించింది. అదే రోజు ఒక బాలుడు శైలేంద్ర(17) తన తల్లి కనబడడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యదు చేశాడు. పోలీసులకు దొరికిన శవం శైలేంద్ర తల్లిదేనని తేలింది.  శైలేంద్ర కథనం ప్రకారం అతని తల్లి భగవంతి దేవి(38) ఫిబ్రవరి 8 సాయంత్రం ఇంటి నుంచి తన స్వగ్రామం మఖోలా వెళ్లేందుకు బస్టాండుకు వెళ్లింది. కానీ మరుసటి రోజు ఆమె స్వగ్రామం చేరలేదని అతనికి ఫోన్ రావడంతో.. తల్లి కోసం శైలేంద్ర వెతకడం ప్రారంభించాడు. ఎంత వెతికినా భగవంతి దేవి ఆచూకీ తెలియకపోవడంతో.. అతను పోలీసులను ఆశ్రయించాడు.


భగవంతి దేవి హత్య కేసు విచారణ మొదలుపెట్టిన పోలీసులకు సంతు రామ్ దీవాన్(26) అనే యువకుడిపై అనుమానం కలిగింది. పోలీసుల విచారణలో భగవంతి దేవి తరుచూ సంతు రామ్‌కు ఫోన్ చేసేదని తెలిసింది. దీంతో పోలీసులు సంతూ రామ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. మొదట అతను భగవంతి దేవి హత్య కేసుతో తనకు ఏ సంబంధం లేదని పోలీసులకు చెప్పాడు. పోలీసులు ఎంత గట్టిగా ప్రయత్నించినా అతను అదే మాట పదే పదే చెప్పాడు. దీంతో పోలీసులు సంతు రామ్‌ని వదిలేశారు. కానీ పోలీసులకు భగవంతి దేవి చనిపోయేముందు బస్టాండు నుంచి ఒక బైక్‌పై ఒక వ్యక్తితో వెళ్లినట్లు సీసీటీవి వీడియోలో తేలింది. ఆ వీడియోలో ఉన్నది సంతు రామ్ అని స్పష్టంగా కనిపించింది.


పోలీసులు మళ్లీ సంతు రామ్‌ని అరెస్టు చేయాలని వెళ్లగా అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతడిని చాకచక్యంగా పట్టుకున్నారు. భగవంతి దేవిని హత్య చేసేందుకు గల కారణమేమిటని పోలీసులు సంతు రామ్‌ని అడిగారు. అప్పుడు అతను జరిగిన విషయం చెప్పాడు. భగవంతి దేవి తనకు గుడిలో పరిచయం అయిందని.. వారి పరిచయం ప్రేమగా మారిందని సంతు రామ్‌ చెప్పాడు. కానీ కొంత కాలం తరువాత సంతు రామ్ ఉద్యోగ రీత్యా మరో ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయం భగవంతి దేవికి నచ్చలేదు. సంతు రామ్ ఎప్పుడూ ఆమె వద్దనే ఉండాలని ఆమె బెదిరించింది. వదిలిపోవాలని ప్రయత్నిస్తే.. అతనిపై అత్యాచారం కేసు పెడతానని బ్లాక్ మెయిల్ చేసింది.


భగవంతి దేవి ప్రవర్తనతో విసిగిపోయిన సంతు రామ్ ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఫిబ్రవరి 8న సాయంత్రం.. భగవంతిదేవి బస్టాండులో నిలబడి సంతూ రామ్‌కు ఫోన్ చేసింది. తన కోసం అక్కడికి రావాలని అతనితో చెప్పింది. సంతూ రామ్ ఆమె కోసం అక్కడికి వచ్చాడు. ఆమెను తన బైక్‌పై కూర్చోపెట్టుకొని మరో ఊరి చివర తీసుకెళ్లి ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. భగవంతిదేవికి మితిమీరిన శృంగార కోరికలు ఉండేవని.. ఆమె తనను ఒక బానిసలా భావించేదని.. అందువల్లే ఆమెను హత్య చేశానని సంతూ రామ్ పోలీసులకు వివరించాడు.


Updated Date - 2022-02-17T05:41:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising