ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2 నెలల క్రితం పెళ్లి.. వారం రోజుల్లో గల్ఫ్‌కు వెళ్లేందుకు అంతా రెడీ.. కానీ ఈ కుర్రాడి విషయంలో ఇలా జరిగిందేంటి..?

ABN, First Publish Date - 2022-01-05T17:57:59+05:30

ఆ కుర్రాడికి రెండు నెలల క్రితం వివాహం జరిగింది.. భార్యను తీసుకుని దుబాయ్ వెళ్లి అక్కడ ఉద్యోగం చేసుకుందామనుకున్నాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ కుర్రాడికి రెండు నెలల క్రితం వివాహం జరిగింది.. భార్యను తీసుకుని దుబాయ్ వెళ్లి అక్కడ ఉద్యోగం చేసుకుందామనుకున్నాడు.. అందుకోసం అన్నీ సిద్ధం చేసుకున్నాడు.. వచ్చే వారమే దుబాయ్ ప్రయాణం.. అయితే ఈ లోపే ఘోర ప్రమాదం జరిగిపోయింది.. రోడ్డు ప్రమాదంలో అతను మరణించాడు.. దీంతో అతని కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.. బీహార్‌లోని ఛప్రాలో ఈ ఘటన జరిగింది. 


ఛప్రాకు చెందిన అజీజ్ అహ్మద్ (25)కు రెండు నెలల క్రితం వివాహం జరిగింది. భార్యతో కలిసి దుబాయ్ వెళ్లిపోయి అక్కడే సెటిల్ అవుదామనుకున్నాడు. అందుకోసం పేపర్లన్నీ సిద్ధం చేసుకున్నాడు. వచ్చే వారమే వారు దుబాయ్ విమానం ఎక్కాల్సి ఉంది. అయితే సోమవారం రాత్రి పక్క ఊరి నుంచి స్నేహితులతో కలిసి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో అజీజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 


మిగిలిన ఇద్దరూ తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో పోరాడుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అజీజ్ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. అజీజ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. కాగా, అజీజ్ బైక్‌ను ఢీకొట్టిన వాహనం గురించి పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-05T17:57:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising