ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చివరి నిమిషంలో పీటల మీద పెళ్లి రద్దు.. కారణమేంటో తెలిస్తే షాకవడం ఖాయం!

ABN, First Publish Date - 2022-06-04T20:29:28+05:30

పెళ్లి అంటే ఎంతో సందడి, సంతోషం. ఆ సందడినంతా తమ కళ్లలో నింపుకోవడం కంటే కెమెరాలో నింపడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లి అంటే ఎంతో సందడి, సంతోషం. ఆ సందడినంతా తమ కళ్లలో నింపుకోవడం కంటే కెమెరాలో నింపడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. తమ పెళ్లి వేడుకను ఫొటోలు, వీడియోల్లో చూసుకోవాలనే అందరూ అనుకుంటున్నారు. కేవలం ఫొటోగ్రాఫర్ రాలేదనే కారణంతో ఒక వధువు తన పెళ్లిని ఆపేసింది. ఎంత మంది బతిమాలినా ఆమె పెళ్లికి అంగీకరించలేదు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు సమీపంలోని మంగళపూర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

భర్త, కూతురిని వదిలి తనతో వచ్చెయ్యమని మాజీ ప్రియుడి బెదిరింపులు.. ఆమె అతని మాట వినకపోవడంతో ఏం చేశాడంటే..


మంగళపూర్‌కు చెందిన రైతు కూతురికి వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ఏర్పాట్లన్నీ ఘనంగా జరిగాయి. బంధుమిత్రులందరూ హాజరయ్యారు. అయితే ఫొటోగ్రాఫర్ మాత్రం రాలేదు. తన జీవితంలో అత్యంత కీలకమైన వివాహంలో జరిగే ప్రతి ఘట్టాన్ని పదిలంగా దాచుకోవాలని ఆమె కోరుకుంది. అయితే ఫొటోగ్రాఫర్ పెళ్లి సమయానికి రాలేకపోయాడు. వారి ఒప్పందం ప్రకారం వరుడి తరఫు వారే ఫొటోగ్రాఫర్‌ను ఏర్పాటు చేయాలి. అయితే వరుడు మాత్రం ఫొటోగ్రాఫర్‌ గురించి పెద్దగా పట్టించుకోలేదు. దీంతో వధువు తీవ్ర ఆగ్రహానికి గురైంది. 


పీటల మీద పెళ్లిని రద్దు చేసింది. వరుడి తరఫు వారు, బంధువులు ఎంత మంది వెళ్లి బతిమాలినా ఆమె పెళ్లికి అంగీకరించలేదు. `అతి ముఖ్యమైన పెళ్లి వేడుకపైనే శ్రద్ధ పెట్టలేకపోయిన వ్యక్తి, పెళ్లయ్యాక  నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడని ఏంటి గ్యారెంటీ` అంటూ ఆ వరుడిని తిరస్కరించింది. చివరకు విషయం పోలీస్ స్టేషన్‌కి చేరింది. రెండువైపుల వాళ్లతోనూ మాట్లాడిన పోలీసులు... కట్న, కానుకలు ఎవరివి వారు తీసుకోవాలని చెప్పారు. వధువు కుటుంబం తాము ఇచ్చిన కట్న, కానుకలను తీసుకుని, పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిపోయింది. 


Updated Date - 2022-06-04T20:29:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising