ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Unacademy: అస్సలు ఊహించలేరు.. మరీ ఇలా చేసిందేంటి.. ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్లు!

ABN, First Publish Date - 2022-12-16T13:02:09+05:30

Unacademy.. దీని గురించి దాదాపు అందరికీ తెలుసు. ఈ ఎడ్యూకేషనల్ టెక్నాలజీ కంపెనీ.. బెంగళూరు కేంద్రంగా పని చేస్తూ పలు రకాల ఆన్‌లైన్ క్లాసులను అందుబాటులోకి తెచ్చింది. అయితే.. తాజాగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: Unacademy.. దీని గురించి దాదాపు అందరికీ తెలుసు. ఈ ఎడ్యూకేషనల్ టెక్నాలజీ కంపెనీ.. బెంగళూరు కేంద్రంగా పని చేస్తూ పలు రకాల ఆన్‌లైన్ క్లాసులను అందుబాటులోకి తెచ్చింది. అయితే.. తాజాగా ఈ సంస్థ పెద్ద తప్పు చేసి, అడ్డంగా దొరికిపోయింది. కేవలం లాభాలపైనే దృష్టిపెట్టి Unacademy.. ముందూ వెనకా చూసుకోకుండా ఓ ప్రముఖ వ్యక్తి ఐడెంటిటీనే మార్చేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు Unacademyని ఓ ఆట ఆడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..

లింక్డిన్(LinkedIn)కు ప్రత్యామ్నాయంగా అన్అకాడమీ NextLevel ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి.. తాజాగా ఓ ప్రకటను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఆ ప్రకటనలో సాగర్ చౌహన్ అనే వ్యక్తిని సీనియర్ ఫ్రంటెండ్ ఇంజినీర్‌గా పరిచయం చేసింది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఆ తర్వాతే Unacademy తప్పులో కాలేసీ అడ్డంగా దొరికిపోయింది. సాగర్ చౌహన్ ప్రొఫైల్‌ దగ్గర సంబంధిత వ్యక్తి ఫొటోను ప్రచురించకుండా.. ప్రముఖ రచయిత, చరిత్రకారుడైనటువంటి మను ఎస్ పిళ్లై(Manu S Pillai) ఫొటోను ప్రచురించింది. ఇలా Unacademy సోషల్ మీడియాలో విడుదల చేసిన ప్రకటనను.. ఆ సంస్థ వ్యవస్థాపకుడు గౌరవ్ ముంజాల్‌ కూడా ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. పైగా Unacademy NextLevelను ఎంచుకోవాలంటూ పిలుపునిచ్చాడు.

గౌరవ్ ముంజాల్‌ చేసిన ఆ ట్వీట్ కాస్తా Manu S Pillai దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ‘ఇలా జరగడం ఇదే తొలిసారేమీ కాదు. నా ముఖం అలా ఉంటుంది. చాలా రకాల ప్రకటలనకు దాన్ని వాడుకోవచ్చు’ అంటూ Unacademy చేసిన తప్పును ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. దీంతో ఆ ట్వీట్ కాస్తా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు స్పందిస్తూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. Unacademy ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-12-16T13:32:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising