ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తలుపు ఎదురుగా ఉన్న మొసలిని చూసి షాక్.. దానితో కుస్తీలు పట్టి చివరకు ఏం చేశాడంటే..

ABN, First Publish Date - 2022-08-20T22:19:38+05:30

ఆ వ్యక్తి తన కూతురిని స్కూలుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ వ్యక్తి తన కూతురిని స్కూలుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు.. స్కూలుకు వెళ్లనని మారాం చేస్తున్న కూతురిని సముదాయించి బయటకు పంపాడు.. కొద్ది సేపటికే  ఆ బాలిక తిరిగి వచ్చి తలుపు ఎదురుగా మొసలి (Alligator) ఉందని చెప్పింది.. స్కూలు ఎగ్గొట్టడానికి కూతురు అలా చెపుతోందేమోననుకున్న ఆ వ్యక్తి పట్టించుకోలేదు.. తీరా బయటకు వెళ్లి చూసే సరికి నిజంగానే అతడికి అక్కడ మొసలి కనిపించింది.. దీంతో అతను షాకయ్యాడు.. బయటకు వెళ్లేందుకు కూడా మార్గం లేకపోవడంతో దాంతో ఫైటింగ్‌కు దిగాడు. 


ఇది కూడా చదవండి..

Essay on Mother: తల్లి గురించి బాలుడు రాసిన వ్యాసం వైరల్.. ఫుల్ మార్కులు ఇస్తున్న నెటిజన్లు!


ఈ ఘటన అమెరికా (America)లోని టెక్సాస్‌లోని మిస్సోరీ సిటీలో జరిగింది. మైక్ ట్రిన్ అనే వ్యక్తి మొసలితో తను చేసిన ఫైటింగ్ (Man Wrestles with Alligator) గురించి ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించాడు. `మా ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్నది ఏంటో అర్థమయ్యాక నేను షాక్‌కు గురయ్యాను. ఆ తర్వాత నా చిన్ననాటి హీరో, క్రొకోడైల్ హంటర్ స్టీవ్ ఇర్విన్‌ ట్రిక్ పాటించాలని నిర్ణయించుకున్నాను. నోరు తెరవకుండా ఉండేందుకు ఇంట్లో ఉన్న తువ్వాళ్లన్నింటినీ మొసలిపై వేశాను. 


తువ్వాళ్లతో దాని తలను చుట్టేశాను. దాంతో అది కదలలేకపోయింది. ఇక, ప్రమాదమేం లేదని భావించి నా కూతుర్ని స్కూలుకు తీసుకెళ్లాను. నేను తిరిగి వచ్చేటప్పటకి కూడా ఆ మొసలి అదే స్థితిలో ఉంది. దాంతో ఓ పెద్ద టేప్ తీసుకుని మొసలి దవడలను గట్టిగా చుట్టేశాను. మరో స్నేహితుడి సహాయంతో దానిని నా కారులో ఎక్కించుని సమీపంలోని ఓ చెరువు దగ్గరకు వెళ్లాను. అందులోకి మొసలిని విడిచిపెట్టేశాన`ని ట్రిన్ తెలిపాడు. 

Updated Date - 2022-08-20T22:19:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising