ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్ కోసం కూతురిని, భార్యను దూరం చేసుకున్నాడు.. ట్రిపుల్ తలాక్ చెప్పేసి వెళ్లిపోయాడు.. చివరకు..

ABN, First Publish Date - 2022-04-18T18:05:44+05:30

ఆ యువతికి రెండేళ్ల క్రితం పెళ్లయింది.. ఏడాది వయసున్న కూతురు కూడా ఉంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ యువతికి రెండేళ్ల క్రితం పెళ్లయింది.. ఏడాది వయసున్న కూతురు కూడా ఉంది.. పెళ్లి సమయంలో కట్నంగా ఇస్తామన్న బైక్ ఇవ్వకపోవడంతో భర్త ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు.. బైక్ తీసుకురావాలని చెప్పి తరచుగా కొట్టేవాడు.. చివరకు ఆమెను పుట్టింటికి పంపేశాడు.. ఇటీవల ఆమె దగ్గరకు వెళ్లి `ట్రిపుల్ తలాక్` చేప్పేశాడు.. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చందన్‌నగర్‌కు చెందిన నజియా అనే యువతి 2020లో సల్మాన్ అనే యువకుడిని వివాహం చేసుకుంది. పెళ్లి సమయంలో కట్నంతో పాటు బైక్ కూడా ఇస్తామని నజియా తండ్రి అంగీకరించాడు. అయితే పేదరికం వల్ల ఇప్పటివరకు బైక్ ఇవ్వలేకపోయాడు. దాంతో నజియాను సల్మాన్ తరచుగా బైక్ కోసం కొట్టేవాడు. బైక్ తీసుకురాకపోతే విడాకులు ఇచ్చేస్తానని బెదిరించాడు. అయినా నజియా తండ్రి బైక్ కొనలేకపోయాడు. 


దీంతో నజియాను, ఏడాది వయసున్న కూతురును సల్మాన్ పుట్టింటికి పంపేశాడు. రెండు నెలలుగా వారు పుట్టింట్లోనే ఉంటున్నారు. గత శనివారం నజియా పుట్టింటికి వెళ్లిన సల్మాన్ ఆమెతో గొడవ పడ్డాడు. అనంతరం ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ సాగిస్తున్నారు. 

Updated Date - 2022-04-18T18:05:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising