ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking Video: పామును పట్టుకుని ముద్దు పెట్టుకుందామనుకున్నాడు.. ఇంతలో ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-10-02T20:55:01+05:30

ఈ భూమి మీద ఎక్కువ మందిని భయపెట్టే జంతువు పాము. పాము ఉందని తెలిస్తే చాలు అటు వైపు వెళ్లడానికి కూడా చాలా మంది భయపడతారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ భూమి మీద ఎక్కువ మందిని భయపెట్టే జంతువు పాము. పాము ఉందని తెలిస్తే చాలు అటు వైపు వెళ్లడానికి కూడా చాలా మంది భయపడతారు. కేవలం కొద్ది మంది మాత్రమే పాములను పట్టుకునే సాహసం చేస్తుంటారు. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ యువకుడు పామును పట్టుకుని సాహసం చేయబోయాడు. అయితే ఆ పాము అతడిని పెదవుల (Snake Bite) మీద కాటు వేసింది. ఆ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


కర్ణాటక (karnataka)లోని శివమొగ్గ జిల్లా బొమ్మన కట్టలో ఒక పాము జనావాసంలోకి వచ్చేసింది. వీధిలో కనిపించిన పామును చూసి గ్రామస్థులు భయపడ్డారు. స్నేక్ సోసైటికి సమాచారం అందించారు. వారు వచ్చే లోపు ఒక యువకుడు ఆ పామును పట్టుకున్నాడు. దాన్ని ముద్దాడుతూ సెల్ఫీ దిగాలనుకున్నాడు. ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పాము ఒక్కసారిగా వెనక్కి తిరిగి అతడి పెదవులపై కాటు వేసింది. దీంతో అతను పామును వదిలేశాడు. అక్కడున్న వారు భయంతో దూరంగా వెళ్లిపోయారు. అక్కడే ఉన్న మరో వ్యక్తి పామును బంధించాడు. పాముకాటుకు గురైన వ్యక్తిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)గా మారింది.   

Updated Date - 2022-10-02T20:55:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising