ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ్యాన్ వర్సెస్ వైల్డ్.. WWE ఫైటింగ్ తలపించిన కంగారూ - ఓ వ్యక్తి కొట్లాట...

ABN, First Publish Date - 2022-05-31T23:29:21+05:30

సహజ ధోరణికి విరుద్ధంగా కంగారూ (Kangaroo) వేట... పెంపుడు కుక్కను రక్షించుకునేందుకు ఓ వ్యక్తి పోరాటం.. వెరసి డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్‌ను తలపించే దృశ్యం ఆవిష్కృతమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూసౌత్‌వేల్స్ : సహజ ధోరణికి విరుద్ధంగా కంగారూ (Kangaroo) వేట... పెంపుడు కుక్కను రక్షించుకునేందుకు ఓ వ్యక్తి పోరాటం.. వెరసి డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్‌ను తలపించే దృశ్యం ఆవిష్కృతమైంది. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌లో వెలుగులోకి వచ్చిన ఆసక్తికరమైన ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు ఈ విధంగా ఉన్నాయి...


క్లిఫ్ డెస్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్కను వెంటబెట్టుకుని సమీపంలోని గార్డెన్‌కు వెళ్లాడు. ఆయన వాకింగ్ చేస్తుండగా కుక్క కూడా అతడిని అనుసరించి నడుస్తోంది. ఈ క్రమంలో ఎటు నుంచో ఓ కంగారూ వచ్చింది. కుక్కను ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించింది. కంగారూని భయటపెట్టేందుకు క్లిఫ్ డెస్ ప్రయత్నించినా ఫలించలేదు. పైగా సీన్‌ రివర్స్ అయ్యింది. తనకేం హాని చేస్తాడోనని భయపడిందో ఏమో క్లిఫ్ డెస్‌పై కంగారూ దాడి చేసింది. ఊహించని ఘటనతో అప్పటికే వణికిపోతున్న డెస్ కొద్ది సేపు చెట్ల కొమ్మల చాటును దక్కోగలిగాడు. అయినా కంగారూ వదల్లేదు. వెంటబడి, పరిగెత్తించి మరీ అతడిని కొట్టింది. కొద్ది క్షణాల తర్వాత ధైర్యం తెచ్చుకున్న అతడు కంగారూపై ప్రతిదాడి మొదలుపెట్టాడు. పెనుగులాటలో కంగారూని రెండు దెబ్బలు కొట్టాడు. కంగారూ కూడా నాలుగు తగిలించింది. మొత్తానికి తన బలంతో కంగారూని నేలపై పడేయగలిగిన క్లిఫ్ డెస్ చివరికి విజయం సాధించాడు. కంగారూని కాసేపు నేలకి నొక్కిపట్టి ఉంచాడు. ఆ తర్వాత చాకచక్యంగా తన పెంపుడు కుక్కతో వెళ్లిపోయాడు. సీసీ కెమెరాలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


వణ్యప్రాణితో కొట్లాటపై క్లిఫ్ డెస్ స్పందించాడు.  తన కుక్కను ఈడ్చుకెళ్లేందుకు కంగారూ ప్రయత్నించిందన్నాడు. అడ్డుకునే ప్రయత్నంలో దాడి చేసిందని వివరించాడు. కంగారూ ఆరడుగుల ఎత్తు ఉంది. చేతి వేళ్లను కొరికింది. తలపై రువ్వడంతో గాయమైంది. దుస్తులు చిరిగిపోయాయి. కాలిపై ఓ గాయమైందని వివరించాడు. కాగా కంగారూలు సాధారణంగా మనుషులపై దాడులు చేయవు. కానీ వాటికి హాని జరుగుతుందని భావిస్తే దాడి చేయగలవు.



Updated Date - 2022-05-31T23:29:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising