ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన Central Railway.. ఎట్టి పరిస్థితుల్లో ఇలా అస్సలు చేయకండని ప్రయాణికులకు సూచన..

ABN, First Publish Date - 2022-03-14T00:49:40+05:30

ప్రయాణికులు ప్రమాదాలబారిన పడకుండా రైల్వే అధికారులు ఎప్పటి కప్పుడు సూచనలు చేస్తూనే ఉంటారు. కానీ కొంత మంది ప్రజలు వాటిని అస్సలు పట్టించుకోరు. సలహాలను పెడచెవిన పెట్టి ప్రాణా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రయాణికులు ప్రమాదాలబారిన పడకుండా రైల్వే అధికారులు ఎప్పటి కప్పుడు సూచనలు చేస్తూనే ఉంటారు. కానీ కొంత మంది ప్రజలు వాటిని అస్సలు పట్టించుకోరు. సలహాలను పెడచెవిన పెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. ఇటువంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియోనే తాజాగా సెంట్రల్ రైల్వే ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ప్రయాణికులు సురక్షిత ప్రయాణం చేయాలని సూచించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



స్టేషన్ నుంచి బయల్దేరిన ట్రైన్‌ను ఎక్కేందుకు ముంబైలోని వడాల రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు యత్నించి విఫలమయ్యాడు. వేగంగా వెళ్తున్న రైలును ఎక్కబోతూ పట్టుతప్పి ప్లాట్ ఫాంపై పడిపోయాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న రైల్వే పోలీస్ కానిస్టేబుల్.. అతడిని రక్షించాడు. ప్లాట్‌ఫాం మీద నుంచి ట్రైన్ కింద పడకుండా పక్కకు లాగాడు. దీంతో సదరు వ్యక్తి ఊరిపి పీల్చుకున్నాడు. కాగా.. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. తాజాగా ఆ వీడియోను సెంట్రల్ రైల్వే ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ప్రయాణికుడిని కాపాడిన కానిస్టేబుల్‌ను అభినందించింది. అంతేకాకుండా రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌ను ఎక్కడం కానీ.. రైలు నుంచి దిగడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దని ప్రజలకు సూచించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 






Updated Date - 2022-03-14T00:49:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising