ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Flipkart Big Billion Days తో ఓ వ్యక్తికి భారీ షాక్.. ల్యాప్ టాప్ ఆర్డర్ ఇస్తే.. పార్సిల్‌లో ఏం వచ్చిందంటే..

ABN, First Publish Date - 2022-09-27T22:50:15+05:30

ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాప్‌టాప్ ఆర్డరిచ్చిన ఓ యువకుడికి తాజాగా భారీ షాక్ తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: పండగ సీజన్ అంటే.. షాపింగ్ ప్రియులు తెగ ఎంజాయ్ చేసే టైం. భారీ డిస్కౌంట్లతో నచ్చినవి కొనుక్కునేందుకు అనువైన సమయం. కానీ.. ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాప్‌టాప్ ఆర్డరిచ్చిన ఓ వ్యక్తికి తాజాగా భారీ షాక్ తగిలింది. ఓ చిన్న రూల్ గురించి అతడి తండ్రికి తెలియకపోవడంతో ల్యాప్‌టాప్‌కు బదులు.. డిటర్జెంట్ పౌడర్ పొట్లాలు చేతికొచ్చాయి. తన పరిస్థితిని వివరిస్తూ నెట్టింట్లో అతడు పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


అసలేం జరిగిందంటే.. 

ఐఐఎమ్ పట్టభద్రుడైన యశస్వీ శర్మ.. ఇటీవల బిగ్ బిలియన్ డేస్‌లో(Big billion Days) భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో(Flipkart) ల్యాప్‌టాప్ ఆర్డరిచ్చాడు. తన తండ్రి కోసం దీన్ని కొనుగోలు చేశాడు. ఆ తరువాత ఓ రోజు ప్యాకెజీ ఇంటికి డెలివరీ అయ్యింది. అయితే.. డెలివరీ బాయ్ పార్సిల్‌ ఇచ్చి వెళ్లిపోయాక దాన్ని తెరిచి చూస్తే మాత్రం ఘడీ డిటర్జెంట్ ప్యాకెట్లు(Ghadi detergent packets) కనిపించాయి. దీంతో.. ఇంటిల్లపాదీ షాకైపోయారు. కస్టమర్‌కేర్‌కు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయిందని యశస్వీ శర్మ వాపోయాడు.


ఓపెన్ బాక్స్ డెలివరీ విధానంపై అవగాహన లేక.. 

ఫ్లిప్‌కార్ట్‌‌లో ఫిర్యాదు చేయగా..వారు ఎటువంటి పరిష్కారం చూపలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు.  డెలివరీ బాయ్ ఎదుటే పార్సిల్‌ని తెరిచి లోపల ఏముందో చూసుకోకపోతే కస్టమర్‌దే పొరపాటని వారు చెప్పారన్నాడు. తన తండ్రికి ‘ఓపెన్ బాక్స్ డెలివరీ’(Open-box Delivery) విధానం గురించి తెలియకే ఈ పరిస్థితి వచ్చిందన్నాడు. పార్సిల్‌ లోపల ల్యాప్‌టాప్ కచ్చితంగా ఉంటుందన్న భరోసాతో  ఆయన డెలివరీ బాయ్ సమక్షంలో దాన్ని తెరిచి చెక్ చేసుకోకుండానే తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీని(OTP) అతడికి ఇచ్చారని వివరించాడు. ఆ తరువాత.. పార్సిల్‌లో ల్యాప్‌టాప్(Laptop) కనిపించకపోవడంతో తాము షాకైపోయామని చెప్పుకొచ్చాడు. డెలివరీ బాయ్ నుంచి పార్సిల్‌ డెలివరీ తీసుకుంటున్న దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయని చెప్పినా ఫ్లిప్‌కార్ట్ వినిపించుకోలేదని వాపోయాడు. తమ లాంటి మధ్యతరగతి వారు ఇంతటి నష్టాన్ని భరించలేరని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో.. తన పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టానన్నాడు.  సమస్య పరిష్కారం కాకపోతే వినియోగదారుల ఫోరంను ఆశ్రయిస్తానని యశస్వి స్పష్టం చేశాడు. 

Updated Date - 2022-09-27T22:50:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising