ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mangaluru యువకుడు ఐటీ జాబ్ వదిలి...గాడిదలు కాస్తున్నాడు...

ABN, First Publish Date - 2022-06-16T15:02:40+05:30

గాడిదల పెంపకాన్ని సాక్షాత్తూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరే వృత్తిగా చేపట్టిన ఘటన సంచలనం రేపింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగళూరు(కర్ణాటక): ‘‘నీవు అక్కడ ఏం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నావా?’’ అని గతంలో ఏం పనిచేయని సోమరిపోతులను ఉద్ధేశించి అనేవారు...కాని నేడు అదే గాడిదల పెంపకాన్ని సాక్షాత్తూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరే వృత్తిగా చేపట్టిన ఘటన సంచలనం రేపింది.మంగళూరు నగరానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ తన ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి మంగళూరులో గాడిద పాల ఫారమ్‌ను ప్రారంభించారు. లక్షల రూపాయల జీతం వచ్చే ఐటీ ఉద్యోగాన్ని వదిలిన శ్రీనివాసగౌడ్ రూ.42లక్షల పెట్టుబడితో 20 గాడిదలతో ఫారమ్ పెట్టారు.సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పెట్టిన గాడిదల పెంపకం, శిక్షణాకేంద్రం దేశంలోనే మొట్టమొదటిది కావడం విశేషం.


గాడిద పాలతో పలు ప్రయోజనాలు

 తాను 2020వ సంవత్సరం వరకు సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేశానని, దాన్ని వదిలేసి గాడిదలు కాస్తున్నానని శ్రీనివాసగౌడ్ చెప్పారు. ‘‘గాడిద పాల వల్ల పలు ప్రయోజనాలున్నాయి, అందుకే గాడిద పాలు అందరికీ అందుబాటులో ఉంచాలనేది నా కల. ఈ పాలు ఔషధ ఫార్మలా’’ అని గౌడ్ వివరించారు. గాడిద జాతుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో తాను గాడిదల పెంపకం ఫాం పెట్టినట్లు యజమాని శ్రీనివాసగౌడ్ చెప్పారు. గాడిద ఫారమ్ గురించి మొదట్లో ప్రజలు నమ్మలేదని ఆయన పేర్కొన్నారు. గాడిద పాలను ప్యాకెట్లలో అందుబాటులోకి తీసుకువచ్చానని, 30 మిల్లీలీటర్ల గాడిద పాల ప్యాకెట్ ధర 150 రూపాయలని ఆయన వివరించారు.


గాడిద పాల ప్యాకెట్లను షాపింగ్ మాల్స్, దుకాణాలు, సూపర్ మార్కెట్లలో అందుబాటులోకి తీసుకువచ్చానన్నారు. తనకు ఇప్పటికే రూ.17లక్షల విలువైన గాడిద పాల ఆర్డర్లు వచ్చాయని మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన శ్రీనివాసగౌడ్ వివరించారు.


Updated Date - 2022-06-16T15:02:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising